close

తాజా వార్తలు

రాష్ట్రాభివృద్ధికి మీరేం చేస్తారో చెప్పండి

అమరావతి: రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పెట్టుబడుల కోసమే విదేశాలకు వెళ్లామని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. తాము చేసిన ప్రయత్నాలతో రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని, 5 లక్షల మందికి ఉపాధి దొరికిందని చెప్పారు. విదేశీ పర్యటనల్లో రూ.16 లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని అన్నారు.39 కోట్లు దుర్వినియోగం చేశారని విమర్శించడం సరికాదన్నారు. తనను విమర్శించేముందు రాష్ట్రాభివృద్ధి కోసం మీరేం చేస్తారో చెప్పండని అధికార పక్షాన్ని నిలదీశారు.

కేటాయింపులపై తెదేపా నిరసన

బడ్జెట్‌లో వివిధ శాఖలకు జరిపిన కేటాయింపులపై తెదేపా నిరసనకు దిగింది. ఈ మేరకు కట్‌ మోషన్లు ప్రవేశపెట్టాలని తెదేపా సభ్యులు నిర్ణయించారు. నిరుద్యోగ భృతి రద్దుకు నిరసనగా ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు కట్‌ మోషన్‌ ఇవ్వనున్నారు. మైనార్టీ శాఖకు తగ్గిన కేటాయింపులపై బాల వీరాంజనేయస్వామి, అంతర్జాతీయ విమాన సర్వీసుల ప్రోత్సాహకాల రద్దుపై వల్లభనేని వంశీ కట్‌మోషన్‌ ప్రవేశపెట్టనున్నారు. 

మరోవైపు మద్యపాన నిషేధమంటూ ఎక్సైజ్‌ శాఖ నుంచి ఎక్కువ ఆదాయం ఆశిస్తున్నందుకు తెదేపా నిరసన వ్యక్తం చేసింది. దీనిపై వల్లభనేని వంశీ కట్‌ మోషన్‌ ఇవ్వనున్నారు. అమ్మ ఒడికి అవసరమైన నిధులు కేటాయింపుపై ఆదిరెడ్డి భవానీ, సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులు తగ్గడంపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజధానికి కేవలం రూ.500 కోట్లు మాత్రమే కేటాయించడంపై అనగాని, రైతులకు వడ్డీ లేని రుణ పథకానికి రూ.100 కోట్లు ఇవ్వడంపై నిమ్మల రామానాయుడు, భవన నిర్మాణ కార్మికుల బీమా తగ్గింపునకు నిరసనగా వెలగపూడి రామకృష్ణ కట్‌మోషన్‌ ఇవ్వనున్నారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.