close

తాజా వార్తలు

ఈనెల 17న తెలంగాణ కేబినెట్‌ భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రివర్గం ఈనెల 17న సమావేశం కానుంది. ప్రగతిభవన్‌లో బుధవారం సాయంత్ర 4 గంటలకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీ జరగనుంది. నూతన పురపాలక చట్టం బిల్లుపై కేబినెట్‌లో చర్చించి ఆమోదం తెలపనున్నారు. కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 18న అసెంబ్లీ, 19న మండలి సమావేశమై బిల్లుపై చర్చ జరిపి ఆమోదముద్ర వేయనుంది. వీటితో పాటు రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, సాగు సంబంధిత అంశాలు, పురపాలక ఎన్నికల నిర్వహణ, రాష్ట్రంలోని పరిస్థితులు సహా ఇతర అంశాలపై మంత్రివర్గంలో చర్చించనున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.