close

తాజా వార్తలు

కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్‌ భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో నూతన పురపాలక చట్టం బిల్లుపై ప్రధానంగా చర్చిస్తున్నారు. 1965 తెలంగాణ మున్సిపల్ చట్టం, 1994 తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ చట్టాల స్థానంలో నూతన బిల్లును రూపొందించారు. ఈ బిల్లుకు ఆమోదం తెలిపేందుకు రేపట్నుంచి శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో బిల్లుపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. దీంతో పాటు గతంలో జారీ చేసిన ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులకు, ఇతర నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.