close

తాజా వార్తలు

జన్‌ఆశీర్వాద్‌యాత్ర ప్రారంభించిన ఠాక్రే

అధికార పీఠమే లక్ష్యంగా శివసేన వ్యూహాలు?

ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ శివసేన పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అధికార భాజపాతో కలిసి రానున్న ఎన్నికల్లో బరిలోకి దిగాలనుకుంటున్న శివసేన ఈ సారి ఎలాగైనా అధికార పీఠాన్ని దక్కించుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు, యువజన నాయకుడు ఆదిత్య ఠాక్రే గురువారం జల్గావ్‌ నుంచి ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టారు. శివసేన సీనియర్‌ నాయకులు ఏక్‌నాథ్‌ షిండే, రామ్‌దాస్‌ కదమ్‌ వంటి ప్రముఖుల ఆధ్వర్యంలో మొదలైన ఈ యాత్ర సుమారు 4 వేల కిలోమీటర్ల మేర కొనసాగుతుందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. మహారాష్ట్రలోని ఇంటింటికీ శివసేన పార్టీని చేర్చాలనే ఉద్దేశంతోనే ఈ యాత్రను మొదలుపెట్టినట్లు ఆదిత్య పేర్కొన్నారు. ‘అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఓట్ల కోసం ఈ యాత్ర మొదలుపెట్టలేదు. సరికొత్త మహారాష్ట్ర నిర్మాణం మాతోనే సాధ్యమవుతుంది. యువకులు, రైతులు, మహిళల అండతో వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతాము.’ అని ఆయన చెప్పుకొచ్చారు. 
288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ప్రస్తుతం భాజపా-శివసేన కూటమి అధికారంలో ఉంది. ఈ ఏడాది అక్టోబర్‌తో అసెంబ్లీ గడువు ముగియనుంది. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.