close

తాజా వార్తలు

మా ఎమ్మెల్యే కనబడట్లేదు: సిద్ధరామయ్య

బెంగళూరు: కర్ణాటక శాసనసభలో బలపరీక్ష నేపథ్యంలో కన్నడనాట ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీమంత్‌ పాటిల్‌ కనిపించట్లేదంటూ సీఎల్పీ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన శ్రీమంత్‌ కనబడటం లేదని సిద్ధరామయ్య ఆరోపిస్తున్నారు. ఈ మేరకు విధానసౌద పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. సిద్ధరామయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాన్ని ముంబయి పంపారు.
శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల్లోపు శాసనసభలో బలం నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి కుమారస్వామికి గవర్నర్‌ సూచించారు. ఈ మేరకు గవర్నర్‌ వాజూభాయ్‌ వాలా సీఎంకు ఓ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో తమ ఎమ్మెల్యే కనబడటం లేదంటూ సిద్ధరామయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.