close

తాజా వార్తలు

ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం

ఒడిశాలోని అనుగుల్‌ పట్టణంలో ఘటన

భువనేశ్వర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం మురికి కాలువలో విసిరివేసిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. ఒడిశాలోని అనుగుల్‌ పట్టణంలో ఈ ఘటన జరిగింది. అనుగుల్‌ బస్టాండు ప్రాంతంలో బంజారాలు నివసిస్తున్నారు. తల్లిదండ్రులు లేని ఎనిమిదేళ్ల ఓ బాలిక ఇక్కడే వారి బంధువుల వద్ద ఉంటోంది. శనివారం రాత్రి వర్షం కురవడంతో బాలిక బంధువులతో కలిసి బస్టాండు సమీపంలో ఓ దుకాణం వరండాలో నిద్రపోయింది. ఉదయం చూసేసరికి బాలిక కనిపించలేదు. పరిసరాల్లో గాలించగా ఆ ప్రాంతంలోని ఓ మురికి కాలువలో తీవ్రగాయాలతో పడి ఉన్న బాలికను గుర్తించారు. నిద్రపోతున్న సమయంలో ఓ యువకుడు తనను ఎత్తుకెళ్లి బస్టాండు వెనుక అత్యాచారం జరిపిన తర్వాత తీవ్రంగా దాడి చేయడంతో స్పృహ కోల్పోయానని బాలిక పోలీసులకు తెలిపింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.