close

తాజా వార్తలు

గత ప్రభుత్వాన్ని ప్రపంచబ్యాంకు నమ్మలేదు

శాసనసభలో మంత్రి బుగ్గన

అమరావతి: గత తెదేపా ప్రభుత్వాన్ని ప్రపంచ బ్యాంకు నమ్మలేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఆరోపించారు. ఆ పార్టీ అవలంబించిన పరిపాలన విధానాలను వరల్డ్‌ బ్యాంకు విశ్వసించలేదన్నారు.ఏపీ శాసనసభ బడ్జెట్‌సమావేశాల్లో భాగంగా అమరావతి ప్రాజెక్టు నుంచి ప్రపంచబ్యాంకు తప్పుకోవడంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. ప్యాకేజీల్లో మార్పులపై ప్రపంచబ్యాంకు అభ్యంతరం చెప్పిందని అన్నారు. ఈ మేరకు రాష్ట్రానికి లేఖ కూడా రాసిందన్నారు. అమరావతికి భూములు ఇవ్వనందుకు పంటలను తగుల పెట్టించారని ఆరోపించారు. ప్రాజెక్టులపై ముందే మాట్లాడుకొని టెండర్లు నిర్వహించినట్లు తెలుస్తోందని దుయ్యబట్టారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.