close

తాజా వార్తలు

‘నేను ఏ బిర్యానీ తినలేదు’: కుమారస్వామి

బెంగళూరు: ఐఎంఏ పొంజి కుంభకోణంలో ప్రధాన నిందితుడైన మన్సూర్ ఆలీఖాన్‌తో కలిసి ఉన్న ఫొటోపై వస్తోన్న విమర్శల మీద కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి స్పందించారు. దానిపై విధాన సౌధలో మాట్లాడుతూ..‘అక్కడ నేను ఏ బిర్యానీ తినట్లేదు’ అని విమర్శలను తిప్పికొట్టారు. 
‘నేను ఓ వ్యక్తి ఇంట్లో బిర్యానీ తిన్నట్లు నాపై ఆరోపణలు వస్తున్నాయి. రంజాన్ సందర్భంగా అక్కడికి నాకు ఆహ్వానం అందితే వెళ్లాను. అక్కడ నేను ఏ బిర్యానీ తినలేదు. ఆరోగ్య కారణాలతో నేను మాంసాహారాన్ని తినడం మానేశాను. కొద్ది మొత్తంలో అన్నం తిన్నాను’ అని బలపరీక్షకు సంబంధించిన చర్చా సమయంలో  కుమారస్వామి వెల్లడించారు. సభలో భాజపా ఎమ్మెల్యే ఐఎంఏ పొంజి కుంభకోణాన్ని లేవనెత్తగా ముఖ్యమంత్రి ఈ సమాధానం ఇచ్చారు. ‘విచారణలోని లోపాల గురించి నేను రాష్ట్ర పోలీసులతో మాట్లాడాను. ఆ నిందితుడి కార్యాలయానికి వెళ్లి వెతగ్గా అతడి పన్ను చెల్లింపులకు సంబంధించి  సర్టిఫికేట్ కనిపించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అతడిని అదుపులోకి తీసుకొని, బెంగళూరుకు తీసుకువచ్చింది. ప్రస్తుతం విచారణ జరగుతోంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏ దశలోను దుర్వినియోగం చేయలేదు’ అని ముఖ్యమంత్రి సభలో స్పష్టం చేశారు. దీనిపై స్పీకర్ రమేశ్ కుమార్ మాట్లాడుతూ..ఆహారపు అలవాట్ల గురించి ఏ మాత్రం చింతించాల్సిన పనిలేదన్నారు. 

కర్ణాటక యూనిట్‌కు చెందిన అధికారిక ట్విటర్ ఖాతాలో భాజపా జులై 16న ఈ ఫొటోను పోస్టు చేసింది. ఐఎంఏ నిందితుడు తప్పించుకోడానికి ఈ ప్రభుత్వమే కారణమంటూ విమర్శలు చేసింది. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.