close

తాజా వార్తలు

‘కుమార’ విశ్వాస పరీక్షపై ఉత్కంఠ

బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సభ వాయిదా అనంతరం తిరిగి ప్రారంభం కాగానే విధానసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అధికార, విపక్ష సభ్యుల నినాదాలతో సభ మారుమోగుతోంది. విశ్వాస పరీక్షను వాయిదా వేయాలని అధికార పార్టీ సభ్యులు.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు విశ్వాస పరీక్ష పూర్తిచేయాలని విపక్ష సభ్యులు పట్టుబడుతున్నారు. సభ్యులు నినాదాలు ఆపి.. సభ సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని స్పీకర్‌ ఎంతగా నచ్చజెప్పినా వారు వినకపోవడంతో గందరగోళం నెలకొంది. ఈ రోజు విశ్వాస పరీక్ష పూర్తవుతుందని సీఎం కుమారస్వామి హామీ ఇచ్చారని ప్రతిపక్ష నేత యడ్యూరప్ప చెప్పారు. ఈ రోజు ఎంత రాత్రయినా సరే తాము సభలోనే ఉంటామని.. విశ్వాస పరీక్ష మాత్రం నిర్వహించి తీరాల్సిందేనని ఆయన పట్టబడుతున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈరోజు రాత్రి  9 గంటల్లోపు సీఎం కుమారస్వామి బలపరీక్షకు సిద్ధం కావాలని స్పీకర్‌ సూచించినా.. దానికి అధికార పక్షం సిద్ధం కాలేదు. ఈ నేపథ్యంలో సభలో అధికార, విపక్ష సభ్యుల నినాదాలతో గందరగోళం కొనసాగుతోంది. ఎమ్మెల్యేల రాజీనామాల వ్యవహారం తేల్చకుండా బలనిరూపణ ఎలా చేస్తారని సీఎం కుమారస్వామి ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకైనా ఆగాలని స్పీకర్‌ను కోరారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.