close

తాజా వార్తలు

నా రాజీనామా అవాస్తవం: కుమారస్వామి

బెంగళూరు: తాను సీఎం పదవికి రాజీనామా చేస్తున్నానంటూ సంతకాలతో ఉన్నవి తప్పుడు పత్రాలని కుమారస్వామి స్పష్టం చేశారు. ఆ పత్రాలను ఆయన సభలో చూపించారు. తన సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేశారని ముఖ్యమంత్రి ఆరోపించారు. సీఎం కుమారస్వామి రాజీనామా చేస్తున్నారని.. ఈ రాత్రి 7గంటలకు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు రాజీనామా సమర్పిస్తారంటూ ఊహాగానాలు చెలరేగిన విషయం తెలిసిందే. అంతేకాకుండా అధికార యంత్రాంగం కూడా కాన్వాయ్‌ను సిద్ధం చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తన సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేసి పత్రాలు సృష్టించారంటూ సీఎం  అసెంబ్లీలోనే పత్రాలు ప్రదర్శించి అవన్నీ తప్పుడు వార్తలని తేల్చి చెప్పారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.