Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 130337
            [news_title_telugu_html] => 

‘కుమార’ పరీక్ష మళ్లీ వాయిదా!

[news_title_telugu] => ‘కుమార’ పరీక్ష మళ్లీ వాయిదా! [news_title_english] => karnataka assembly Adjourned for tuesday [news_short_description] => సంకీర్ణ కూటమి వ్యూహాలతో ఘడియకో మలుపు తిరిగిన కర్ణాటక రాజకీయ సంక్షోభానికి తెరపడలేదు. క్షణ క్షణం ఉత్కంఠ రేపిన ‘కుమార’ బల పరీక్ష వ్యవహారం సోమవారం అర్ధరాత్రి అయినా ఎటూ తేలకపోవడంతో విధాన సభ మంగళవారానికి వాయిదా పడింది. మంగళవారం సాయంత్రం 4గంటలకు బలాన్ని నిరూపించుకోవాలని స్పీకర్‌ రమేశ్ కుమార్‌ అధికార పక్షానికి డెడ్‌లైన్‌ విధించారు. కాంగ్రెస్‌ తరఫున కొంత మంది మాట్లాడాల్సి ఉందని, రాత్రి 8గంటల వరకు సమయం ఇవ్వాలని  సిద్ధరామయ్య కోరగా.. అందుకు [news_tags_keywords] => kumara swamy,karnataka assembly,politics [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-07-23 00:41:36 [news_isactive] => 1 [news_status] => 2 ) )
‘కుమార’ పరీక్ష మళ్లీ వాయిదా! - karnataka assembly Adjourned for tuesday - EENADU
close

తాజా వార్తలు

‘కుమార’ పరీక్ష మళ్లీ వాయిదా!

బెంగళూరు: సంకీర్ణ కూటమి వ్యూహాలతో ఘడియకో మలుపు తిరిగిన కర్ణాటక రాజకీయ సంక్షోభానికి సోమవారమూ తెరపడలేదు. క్షణ క్షణం ఉత్కంఠ రేపిన ‘కుమార’ బల పరీక్ష వ్యవహారం అర్ధరాత్రి అయినా ఎటూ తేలకపోవడంతో విధాన సభ మంగళవారానికి వాయిదా పడింది. మంగళవారం సాయంత్రం 4గంటలకు బలాన్ని నిరూపించుకోవాలని స్పీకర్‌ రమేశ్ కుమార్‌ అధికార పక్షానికి డెడ్‌లైన్‌ విధించారు. కాంగ్రెస్‌ తరఫున కొంత మంది మాట్లాడాల్సి ఉందని, రాత్రి 8గంటల వరకు సమయం ఇవ్వాలని  సిద్ధరామయ్య కోరగా.. అందుకు సాధ్యం కాదని స్పీకర్‌ తేల్చి చెప్పారు. దీంతో మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు చర్చను ముగించి.. సాయంత్రం 6గంటలకు విశ్వాస పరీక్షను నిర్వహిస్తామని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. దీంతో సభను స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ మంగళవారానికి వాయిదా వేశారు. తిరిగి సభ ఉదయం 11గంటలకు ప్రారంభం కానుంది. 

సంకీర్ణ పక్షం ఎమ్మెల్యేల రాజీనామాలతో కన్నడ రాజకీయాల్లో పెను సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే.  రెండు రోజుల విరామం తర్వాత తిరిగి సోమవారం ప్రారంభమైనప్పటికీ అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. విశ్వాస పరీక్షను వాయిదా వేయాలని అధికార పక్షం.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజే నిర్వహించాలని విపక్షం పట్టుబట్టడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎంత రాత్రయినా సభలోనే ఉంటాం.. బల నిరూపణ పూర్తిచేయాల్సిందేనని ప్రతిపక్ష నేత యడ్యూరప్ప పట్టుబట్టగా.. ఎమ్మెల్యేల రాజీనామాల వ్యవహారాన్ని తేల్చకుండా బలనిరూపణ ఏంటని సీఎం కుమారస్వామి ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంతవరకు బలపరీక్ష నిర్వహించవద్దని ఆయన స్పీకర్‌ను కోరారు. అధికార పార్టీ సభ్యులు సభను మంగళవారానికి వాయిదా వేయాలని కోరారు.

కర్ణాటకలో మూడు వారాల క్రితం అధికార కూటమికి చెందిన 15 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో మొదలైన రాజకీయ సంక్షోభం.. గత వారం కుమారస్వామి అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో తారస్థాయికి చేరింది. ఈ తరుణంలో గత వారంలో రెండు రోజుల పాటు చర్చించిన విధానసభ ఏ నిర్ణయం లేకుండానే వాయిదా పడి తిరిగి సోమవారం ప్రారంభమైంది. స్పీకర్‌ ఎట్టిపరిస్థితుల్లో సోమవారం విశ్వాస పరీక్ష నిర్వహించాలని ప్రయత్నించినా చివరకు సభలో నెలకొన్న పరిస్థితుల రీత్యా ఆయన సభను మంగళవారానికి వాయిదా వేయాల్సి వచ్చింది. 

మరోవైపు, గత వారంలో రెండుసార్లు విశ్వాస పరీక్షకు ముగింపు పలకాలంటూ సీఎం, స్పీకర్‌కు సూచించిన గవర్నర్‌ వాజూభాయి వాలా చివరకు సోమవారం నిర్ణయం తీసుకోకపోతే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని పరోక్షంగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సమావేశమైన విధానసభలో సోమవారం మధ్యాహ్నం నుంచీ అధికార, విపక్ష సభ్యులు పోటాపోటీ విమర్శలకు దిగారు. దీంతో సభ వేడెక్కింది. సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు విపక్ష భాజపా కుట్రలు చేస్తోందని అధికార పార్టీ విమర్శించగా.. బలంలేకపోయినా ప్రభుత్వంలో కొనసాగుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ భాజపా మండిపడింది. సోమవారం విశ్వాస పరీక్ష నిర్వహిస్తామని ఇచ్చిన మాటపై కట్టుబడి ఉండాలని స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ పదేపదే అధికార పక్షానికి సూచిస్తూ వచ్చారు. ఒక దశలో తనను బలిపశువుని చేయొద్దని కూడా అన్నారు. ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయం తేలే వరకు ఓటింగ్‌ ఆపాలని కాంగ్రెస్‌ కోరగా.. కుమారస్వామి కూడా విశ్వాస పరీక్ష ముగింపునకు మరో రెండు రోజులు కావాలని కోరారు. అయితే, అధికార, విపక్ష సభ్యులు మాట్లాడుకొని నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ సూచించారు. భాజపా మాత్రం ఎట్టిపరిస్థితుల్లో సోమవారమే ఓటింగ్‌ నిర్వహించాలని పట్టుపట్టింది. కుమార సర్కార్‌ ఒక్కక్షణం కూడా కొనసాగడానికి వీలులేదని విమర్శించింది. ఈ తరుణంలో సభ కొంతసమయం పాటు వాయిదా పడింది. దీంతో భాజపా, జేడీఎస్‌ సభ్యులు స్పీకర్‌ను ఆయన ఛాంబర్‌లో కలిశారు. బలపరీక్షను వాయిదా వేయాలని జేడీఎస్‌ కోరగా.. ఎట్టి పరిస్థితుల్లో సోమవారమే నిర్వహించాలని భాజపా సభ్యులు పట్టుబట్టారు. దీంతో సోమవారం రాత్రి 9గంటల లోపు బలపరీక్ష నిరూపించుకోకుంటే తాను పదవి నుంచి వైదొలుగుతానని స్పీకర్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.