Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 130660
            [news_title_telugu_html] => 

ముగ్గురు తెదేపా ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

[news_title_telugu] => ముగ్గురు తెదేపా ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ [news_title_english] => three tdp MLAs suspended [news_short_description] => ఏపీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా శాసనసభ మంగళవారం వాడివేడిగా ప్రారంభమైంది. ప్రారంభమైన కొద్దిసేపటికే.. తెదేపా ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల [news_tags_keywords] => Ap Assembly,Amaravati [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/Ezs6Nxod0D0 [news_videoinfo] => |https://www.youtube.com/embed/Ezs6Nxod0D0 [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-07-23 09:58:15 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ముగ్గురు తెదేపా ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ - three tdp MLAs suspended - EENADU
close

తాజా వార్తలు

ముగ్గురు తెదేపా ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

అమరావతి: ఏపీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా మంగళవారం శాసనసభ వాడివేడిగా ప్రారంభమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే పింఛను విషయంలో తలెత్తిన ప్రశ్న కారణంగా ముగ్గురు తెదేపా ఎమ్మెల్యేలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ప్రశ్నోత్తరాల సమయంలో వైకాపా ఎన్నికల హామీపై స్పష్టతకు తెదేపా సభ్యుడు రామానాయుడు డిమాండ్‌ చేశారు. అయితే మేనిఫెస్టోలో అలాంటి హామీ ఇవ్వలేదని పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ జోక్యం చేసుకున్నారు. ఎన్నికల సమయంలో తాను మాట్లాడిన వీడియోను సభలో ప్రదర్శించారు. 

దీనిపై స్పందించిన తెదేపా సభ్యులు తమ వద్ద ఉన్న వీడియోను ప్రదర్శించేందుకు అనుమతి కోరారు. దీనికి ప్రభుత్వం నిరాకరించడంతో స్పీకర్‌ తదుపరి ప్రశ్నకు వెళ్లారు. దీంతో తెదేపా సభ్యులు ఆందోళనకు దిగారు. ఆగ్రహించిన శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌.. ఈ సమావేశాలు ముగిసేవరకు తెదేపా సభ్యులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బుచ్చయ్య చౌదరిలను సస్పెండ్‌ చేయాలని స్పీకర్‌కు ప్రతిపాదించారు. స్పీకర్‌ స్థానంలో ఉన్న ఉపసభాపతి కోన రఘుపతి దీనిని ఆమోదించారు. అయినప్పటికీ తెదేపా సభ్యులు సభను వీడలేదు. అక్కడే ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో మార్షల్స్‌ బలవంతంగా వారిని బయటకు తీసుకెళ్లిపోయారు.

వైఎస్‌ఆర్‌ భరోసాపై తుది ప్రకటన చేసింది 2018లో..: జగన్‌

సభ్యుల సస్పెన్షన్‌ అనంతరం ప్రతిపక్ష నేత చంద్రబాబు సభలో మాట్లాడారు. 45 ఏళ్లకు పింఛన్‌పై సాక్షి పత్రికలో వచ్చిన కథనాన్ని మరోసారి ప్రస్తావించారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్‌ మరోసారి వివరణ ఇచ్చారు. చంద్రబాబు ప్రస్తావిస్తున్న సాక్షి కథనం 2017 అక్టోబరులో ప్రచురితమైందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు చేయూతనిచ్చే వైఎస్‌ఆర్‌ భరోసా పథకంపై తాను తుది ప్రకటన చేసింది 2018 సెప్టెంబర్‌లో అని చెప్పారు. ఈ క్రమంలో మాట్లాడేందుకు చంద్రబాబు సమయం కోరగా.. జగన్‌ మండిపడ్డారు. ఉపసభాపతి కోన రఘుపతి తర్వాతి బిల్లులపై చర్చ ప్రారంభించారు. 

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.