close

తాజా వార్తలు

సభ ముందుకు మద్యం నియంత్రణ బిల్లు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌, భారత్‌లో తయారైన విదేశీ మద్యం నియంత్రణ చట్ట సవరణ బిల్లును ఏపీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్‌, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి కె.నారాయణ స్వామి శాసన మండలిలో ఉండటంతో ఆయనకు బదులుగా ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. మద్యం దుకాణ లైసెన్సులు, మద్యం నియంత్రణకు చర్యలు తీసుకుంటామని ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టింది. ముగ్గురు తెదేపా సభ్యుల సస్పెన్షన్‌తో ఆందోళనల మధ్యే ఈ బిల్లును అధికారపక్షం ప్రవేశపెట్టింది. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించేలా చట్ట సవరణకు అవసరమైన ముసాయిదా బిల్లును కూడా శాసనసభ ముందుంచింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.