close

తాజా వార్తలు

మరికాసేపట్లో తేలనున్న కుమార భవితవ్యం

బెంగళూరు: కర్ణాటక రాజకీయం క్లైమాక్స్‌కు చేరుకుంది. మూడు వారాలుగా అనేక మలుపులు తిరుగుతూ ఉత్కంఠ రేపిన కన్నడ రాజకీయ సంక్షోభానికి కాసేపట్లో ముగింపు పడనుంది. బలపరీక్షపై ఈ నెల 18న ప్రారంభమైన చర్చ ఈ రోజు కూడా కొనసాగుతోంది. ప్రస్తుతం సీఎం కుమార స్వామి తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన ప్రసంగాన్ని ముగించిన అనంతరం ఓటింగ్‌ నిర్వహించనున్నారు. అయితే, కుమార స్వామి తనకు మూడు గంటల వ్యవధి ఇవ్వాలని కోరుతుండగా.. త్వరగా ముగించాలని స్పీకర్‌ సూచించారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఎట్టి పరిస్థితుల్లో బలపరీక్షను నిర్వహించాలనే పట్టుదలతో ఉన్న స్పీకర్‌ సమయం దాటిపోవడంతో సీఎంపై ఒత్తిడి పెంచుతూ ఓటింగ్‌ నిర్వహించే దిశగా పావులు కదుపుతున్నారు. 15 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో సంక్షోభంలో చిక్కుకున్న కుమార నేతృత్వంలోని కాంగ్రెస్‌- జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం కాసేపట్లో విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. ఎమ్మెల్యేల రాజీనామాతో మైనార్టీలో పడిన నేపథ్యంలో కుమార ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గుతుందా? లేదా అనేది కాసేపట్లో తేలిపోనుంది. కుమార ప్రభుత్వం బలనిరూపణకు 103 సభ్యుల బలం అవసరం కాగా.. స్పీకర్‌, నామినేటెడ్‌ ఎమ్మెల్యేను మినహాయిస్తే అధికార పక్షానికి 99 మంది సభ్యుల బలమే ఉంది. ఈ నేపథ్యంలో కుమార ప్రభుత్వం ఏ మార్గంలో బలం నిరూపించుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. 

ప్రస్తుతం సభలో ఉన్న పరిస్థితి..
* సభకు హాజరైన 105 మంది భాజపా ఎమ్మెల్యేలు
* కాంగ్రెస్, జేడీఎస్, బీఎస్పీ పక్షం నుంచి 101 మంది హాజరు
* ఇండిపెండెంట్ ఎమ్మెల్యే శంకర్ సభకు హాజరు 
* కుమారస్వామికి మద్దతు ఇచ్చిన బీఎస్పీ ఎమ్మెల్యే మహేష్
* స్పీకర్, నామినేటెడ్ ఎమ్మెల్యేను మినహాయిస్తే అధికార పక్ష బలం 99
* సభకు హాజరు కాని 18 మంది ఎమ్మెల్యేలు: వీరిలో రెబల్ ఎమ్మెల్యేలు 15 మంది, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, అనారోగ్యంతో అసెంబ్లీకి గైర్హాజరైన కాంగ్రెస్ సభ్యులు శ్రీమంత్ పాటిల్, నాగేంద్ర
* సభలో మెజార్టీకి కావాల్సిన సంఖ్యా బలం 103.

ఆ స్వతంత్ర ఎమ్మెల్యేల కోసం బాహాబాహీ

కుమారస్వామి సర్కార్‌ బలపరీక్షకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ కర్ణాటకలో నాటకీయ పరిణామాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి.ఈ సాయంత్రం 6 గంటలకు ఎట్టిపరిస్థితుల్లో బలపరీక్ష నిర్వహించి తీరుతానని స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ స్పష్టం చేయడంతో..కాంగ్రెస్‌,భాజపాలు తమ వ్యూహాలకు పదనుపెడుతున్నాయి. ఇందులో భాగంగా బెంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కోసం భాజపా, కాంగ్రెస్‌ ప్రయత్నాలు ప్రారంభించాయి. ఎమ్మెల్యేలను కలిసేందుకు ఆ అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు.. ఓ దశలో బాహాబాహీకి దిగడం గమనార్హం. అపార్ట్‌మెంట్‌లోనికి తమను అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఇరు పార్టీల కార్యకర్తలు ఆ అపార్ట్‌మెంట్‌ను చుట్టుముట్టడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

బెంగళూరులో 144 సెక్షన్‌
కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నేపథ్యంలో పోలీసులు బెంగళూరు నగరంలో పలు ఆంక్షలు పెట్టారు. బెంగళూరులో 144 సెక్షన్‌ విధించారు. ప్రభుత్వం పడిపోతే అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.