close

తాజా వార్తలు

సీఎం పదవికి కుమారస్వామి రాజీనామా

బెంగళూరు: కర్ణాటక శాసనసభలో నిర్వహించిన విశ్వాస పరీక్షలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం ఓటమి పాలైన నేపథ్యంలో సీఎం పదవికి కుమారస్వామి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్‌కు అందజేశారు. రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌ వాజూభాయ్‌వాలాకు రాజీనామాను సమర్పించారు. రాజీనామాను స్వీకరించిన గవర్నర్‌.. వెంటనే దాన్ని ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని, ఈ సమయంలో ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవద్దని గవర్నర్‌ కుమారస్వామికి సూచించారు.
కుమారస్వామి ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం సభలో ఓటింగ్‌ నిర్వహించగా.. కనీస మెజార్టీకి అవసరమైన సభ్యుల మద్దతును కుమార సర్కార్‌ సంపాదించలేకపోయింది. ఈ పరిస్థితుల్లో దాదాపు 14 నెలల కాంగ్రెస్‌ - జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం పతనమైంది. 99- 105 ఓట్ల తేడాతో ప్రభుత్వం పడిపోయింది.

రాజీనామాను ఆమోదిస్తూ కుమారస్వామికి గవర్నర్‌ అందించిన లేఖ


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.