close

తాజా వార్తలు

బొగ్గు గనిలో ప్రమాదం..నలుగురు మృతి!

భువనేశ్వర్‌: ఒడిశాలోని కోల్‌ ఇండియా లిమిటెడ్‌కు చెందిన ఓ బొగ్గుగనిలో జరిగిన ప్రమాద ఘటనలో నలుగురు కార్మికులు మృతిచెందినట్లు సమాచారం. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు సంస్థ అధికార ప్రతినిధి ఓ ప్రకటన చేసినట్లు ప్రముఖ ఆంగ్ల పత్రిక పేర్కొంది. కార్మికులు పనిలో నిమగ్నమై ఉండగా.. బొగ్గు ఒక్కసారిగా కుప్పకూలడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంతో గనిలో సాధారణ కార్యకలాపాల పునరుద్ధరణకు మరో వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతో రోజుకు దాదాపు 20వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోనుందని తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.