Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 131326
            [news_title_telugu_html] => 

రాష్ట్రంలో లంచాలనే మాట వినపడదు: జగన్‌

[news_title_telugu] => రాష్ట్రంలో లంచాలనే మాట వినపడదు: జగన్‌ [news_title_english] => CM Jagan Speech in Assembly [news_short_description] => రాష్ట్రంలో పైస్థాయి నుంచి దిగువస్థాయి వరకూ లంచాలనే మాట వినిపించదని.. పారదర్శకమైన విధానం అవలంబిస్తామని సీఎం జగన్మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. పరిశ్రమల స్థాపనలో పెట్టుబడిదారులకు... [news_tags_keywords] => Jagan,Ap Assembly,Ap Politics [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-07-25 00:25:12 [news_isactive] => 1 [news_status] => 2 ) )
రాష్ట్రంలో లంచాలనే మాట వినపడదు: జగన్‌ - CM Jagan Speech in Assembly - EENADU
close

తాజా వార్తలు

రాష్ట్రంలో లంచాలనే మాట వినపడదు: జగన్‌

అమరావతి: రాష్ట్రంలో పైస్థాయి నుంచి దిగువస్థాయి వరకూ లంచాలనే మాట వినిపించదని.. పారదర్శకమైన విధానాలు అవలంబిస్తామని సీఎం జగన్మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. పరిశ్రమల స్థాపనలో పెట్టుబడిదారులకు ఎలాంటి అడ్డంకులూ ఉండబోవని తేల్చి చెప్పారు. శాసనసభలో పరిశ్రమలు కర్మాగారాల్లో స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. ఉద్యోగాలు దొరక్క యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని తప్ప పరిశ్రమలను మరేమీ కోరబోమన్నారు. పరిశ్రమలను ప్రోత్సహించే దిశగానే రాష్ట్రంలోని ప్రతి నిర్ణయమూ ఉందని చెప్పారు. స్థానిక యువతకు ఉపాధి ఉండాలనే ఈ బిల్లును తీసుకువస్తున్నామన్నారు. పరిశ్రమలతో కలసి యువతకు నైపుణ్యాలను అందించే ప్రయత్నం చేస్తామన్నారు. తమ ప్రభుత్వం వేసే ప్రతి అడుగూ పరిశ్రమల ప్రోత్సాహానికే అని గుర్తించాలన్నారు.  విద్యుత్ ఒప్పందాలను సమీక్షిస్తున్నందున పరిశ్రమలు రావన్న దుష్ప్రచారం జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. విద్యుత్ ధరలు తగ్గించి  సరఫరా చేసేది పరిశ్రమలు, రైతులు, ప్రజలకేనని చెప్పారు. విద్యుత్ ధరలు తగ్గితే వారికే లబ్ధి కలుగుతుందన్నారు. పరిశ్రమలు, కర్మాగారాల్లో స్థానిక యువతకు రిజర్వేషన్లు కల్పించే ఈ బిల్లు చరిత్రాత్మకం అవుతుందని సీఎం చెప్పారు.

కీలక బిల్లులకు శాసనసభ ఆమోదం

ఏపీ శాసనసభ కీలకమైన బిల్లులకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పంట హక్కుదారుల బిల్లు, ఆంధ్రప్రదేశ్ హిందూ ధార్మిక సంస్థలు, దేవాలయాల సవరణ బిల్లు, విద్యుత్ శాసననాల సవరణ బిల్లు, పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్ల కల్పన, ఆంధ్రప్రదేశ్ మద్యం వ్యాపార క్రమబద్ధీకరణ సవరణ బిల్లులను శాసనసభ ఆమోదించింది. అంతకుముందు ఈ బిల్లులపై జరిగిన చర్చలో సభ్యులు మాట్లాడారు. ప్రతిపక్ష సభ్యులు సభలో లేనప్పటికీ ఈ బిల్లులు శాసనసభ ఆమోదాన్ని పొందాయి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.