
తాజా వార్తలు
భువనేశ్వర్: రసగుల్లా వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ తీపి వస్తువు కోసం జరిగిన పోరాటంలో గతంలో పశ్చిమబెంగాల్ భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) దక్కించుకోగా.. ఒడిశా సైతం ఈ ట్యాగ్‌ను పొందింది. ‘ఒడిశా రసగొలా’గా దీనికి చెన్నైలోని జీఐ రిజిస్ట్రీ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. 2028 ఫిబ్రవరి 22 వరకు ఈ ట్యాగ్ చెల్లుబాటు కానుంది.
నాణ్యత, పేరుప్రఖ్యాతలు ఉన్న ఆయా వస్తువులను వాటి మూలాలను బట్టి ఆయా ప్రాంతాలకు చెందినవని నిర్ధారిస్తూ జీఐ చిహ్నాలను మంజూరు చేస్తుంటారు. జీఐ పొందే క్రమంలో ఆ వస్తువు మూలాలు కచ్చితంగా ఆ ప్రాంతలోనే ఉన్నాయని నిరూపించాల్సి ఉంటుంది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌లో సభ్యదేశమైన భారత్‌లో 2003 నుంచి ఈ చిహ్నాలను ఇస్తున్నారు. ఈ వ్యవహారంలో రసగుల్లా మాదేనంటూ 2015 నుంచి బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు పోటీపడ్డాయి. చివరికి ఈ పోటీలో ఒడిశాపై బెంగాల్ పైచేయి సాధించింది. 2017 నవంబర్‌లో అంతర్జాతీయ గుర్తింపును పొందింది. అప్పట్లో పశ్చిమ బెంగాల్ రసగుల్లాకు ‘బంగ్లార్ రసగుల్లా’గా జీఐ ట్యాగ్‌ను జారీ చేశారు.
రసగుల్లాకు భౌగోళిక గుర్తింపుపై ఒడిశా ప్రభుత్వం పోరాడుతూ వచ్చింది. ఒడిశా సూక్ష్మ పరిశ్రమల కార్పొరేషన్ లిమిటెడ్, ఉత్కల్ మిస్తన్న వ్యవసాయ సమితి కలిసి రసగుల్లాకు సంబంధించిన జీఐ రిజిస్ట్రీ ఆఫీసులో సంబంధిత పత్రాలను అందజేశాయి. దీంతో ఎట్టకేలకు ‘ఒడిశా రసగొలా’ పేరిట జీఐ ట్యాగ్‌ను పొందింది. జీఐ ట్యాగ్ రావడంతో ఆ రాష్ట్ర వాసులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కృషిని కొనియాడారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- జయలలితగా రమ్యకృష్ణను చూశారా?
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- ‘అతను నన్ను చంపాలని చూస్తున్నాడు’
- భయం.. కోపం రెండూ వస్తున్నాయి!
- అలాంటివాటిపై దృష్టి సారిస్తే నష్టమే:మమత
- ఆ పాత్రకు అరవిందస్వామి అనుకున్నారట!
- ఎంజీ విద్యుత్తు కారు విశేషాలు ఇవే..
- కేటీఆర్‌తో చర్చకు సిద్ధం: లక్ష్మణ్
- బురద చల్లేందుకే ‘రౌండ్‌టేబుల్’:అంబటి
- ఇంటి వరకూ తోడుగా వస్తారు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
