close

తాజా వార్తలు

‘నన్ను ఇందులోకి లాగొద్దు’: ప్రియాంక

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిపై స్పష్టీకరణ

దిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతలను స్వీకరించాలంటూ నేతలు ఇచ్చిన సలహాను జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ తోసిపుచ్చారు. గురువారం పార్టీ సమావేశంలో అధ్యక్ష బాధ్యతలపై ఆమెకు కొందరు నేతలు సూచనలు చేశారు. దానిపై ఆమె మాట్లాడుతూ తాను ఈ బరువు బాధ్యతలు స్వీకరించాలనుకోవడం లేదని పార్టీకి సూటిగా స్పష్టం చేశారు. ఇప్పటికే పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్ సింగ్, కేరళ కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ అధ్యక్ష పదవికి ఆమె పేరును సూచిస్తూ, మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. 

ఆగష్టు 20న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి నిర్వహణకు సంబంధించి జనరల్‌ సెక్రటరీలు, రాష్ట్రాల ఇంఛార్జిలు గురువారం ఉదయం సమావేశమయ్యారు. ఆ సందర్భంగా ఝార్ఖండ్ పార్టీ ఇంఛార్జి ఆర్‌పీఎన్ సింగ్‌ మాట్లాడుతూ పార్టీ బాధ్యతలు స్వీకరించాలని ప్రియాంకకు సూచించగా, ఆమె తిరస్కరించారు. ‘నన్ను ఇందులోకి లాగొద్దు’ ఆమె స్పష్టం చేశారని కాంగ్రెస్‌ నేతలు మీడియాకు వెల్లడించారు. 
రాహుల్ కూడా ఇప్పటికే ఈ ప్రతిపాదనను తిరస్కరించిన సంగతి తెలిసిందే. గాంధీ కుటుంబానికి చెందిన వారెవరు ఆ పదవిని చేపట్టరని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ జులైలో రాజీనామా చేశారు. అయితే ఈ వారం చివర్లోగా తాత్కాలిక అధ్యక్షుడిని నియమిస్తారన్న వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.