close

తాజా వార్తలు

పీకల్లోతు నీటిలోకి దిగి చిన్నారిని రక్షించిన పోలీసు

గాంధీ నగర్‌: ఈ ఫొటోను చూశారా? బుట్టలో చిన్నారిని పెట్టుకుని ఆపసోపాలు పడుతూ పీకల్లోతు నీళ్లలో నడుచుకుంటూ ఓ వ్యక్తి వస్తున్నాడు కదా! అంత సాహసం చేసి పసిబిడ్డను తీసుకొస్తున్న ఆయన ఆ చిన్నారి తండ్రి అనుకుంటే పొరపాటే. ఆయనో పోలీసు. స్థానిక విశ్వామిత్ర నది సమీపంలో ఉన్న దేవిపుర ప్రాంత ఎస్సై గోవింద్‌ చద్వా ఆయన. ఐదడుగుల లోతు నీళ్లలో సుమారు 1.5కి.మీ దూరం పాపను తీసుకెళ్లి సురక్షిత ప్రాంతానికి చేర్చారు. భారీ వర్షాల ధాటికి గుజరాత్‌లోని వడోదర నగరం అతలాకుతలమవుతోంది. దీంతో  సహాయక చర్యలను పర్యవేక్షించడానికి గోవింద్‌ అక్కడికి వచ్చారు. ఒక చేత్తో బుట్టను పట్టుకుని, మరో చేత్తో తాడు సాయంతో 18నెలలున్న చిన్నారిని ఆయన కాపాడారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లు గోవింద్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

దీనిపై ఎస్సై మాట్లాడుతూ..‘దేవిపుర ప్రాంతం మొత్తం జలమయమైందని మా దృష్టికి వచ్చింది. సహాయక చర్యలు అందించడానికి అక్కడికి వెళ్లాం. ఓ తల్లీబిడ్డా వరదలో చిక్కుకోవడం గమనించాను. ఆమెను కాపాడాల్సిందిగా మా బృందానికి సూచించాను. ఇక పాపను రెండు చేతులతో పట్టుకుని వరదలో వెళ్లడం కష్టమనిపించింది. అక్కడున్న వారిని ఓ బుట్ట అడిగి అందులో పాపను పెట్టుకుని వెళ్లిపోవచ్చని అనుకున్నాను. బుట్టలో కొన్ని బట్టలు, బెడ్‌షీట్‌ వేసి పాపను అందులో పడుకోబెట్టి తీసుకొచ్చాను’ అని తెలిపారు.

గుజరాత్‌లోని వడోదర నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా అక్కడ 50సె.మీ వర్షపాతం నమోదైంది. రహదారులన్నీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వర్షాల ధాటికి ఆరుగురు మృతి చెందారు. వరద నీటిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చర్యలు తీసుకున్నట్లు ముఖ్యమంత్రి విజయ్‌ రూపాణి చెప్పారు. వడోదరా చెంతనే ఉన్న విశ్వామిత్రీ నది భారీ వర్షాలకు పొంగి పొర్లుతోంది. 600కు పైగా మొసళ్లున్న ఆ నది నుంచి కొన్ని వరద నీటితోపాటు నగరంలోకి ప్రవేశించాయి. అటవీ శాఖ అధికారులు మూడింటిని బంధించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.