close

తాజా వార్తలు

‘370 రద్దు.. చరిత్రాత్మకం’

‘370 రద్దు.. చరిత్రాత్మకం’

దిల్లీ: జమ్మూకశ్మీర్‌ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పలు పార్టీలు స్వాగతించాయి. ఆర్టికల్‌ 370 రద్దును చారిత్రక నిర్ణయంగా అభివర్ణించాయి. ఈ ఆర్టికల్‌ ద్వారా దేశంలో జమ్మూకశ్మీర్‌ పూర్తిస్థాయిలో అంతర్భాగమైందని కొనియాడాయి. కొన్ని పార్టీలు సైద్ధాంతిక విభేదాలను పక్కనపెట్టి మరీ మద్దతిచ్చాయి. ఎన్డీయే, ఎన్డీయేతర పక్షాలు కూడా కేంద్రం పక్షాన నిలిచాయి. శివసేన, బిజూ జనతా దళ్‌, అన్నాడీఎంకేతో పాటు ఏపీ నుంచి తెదేపా, వైకాపా కేంద్రం నిర్ణయానికి మద్దతు ప్రకటించాయి. ఎప్పుడూ మోదీపై నిప్పులు చెరిగే దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సైతం ఈ నిర్ణయానికి మద్దతు తెలపడం విశేషం. పలువురు ప్రముఖులు సైతం దీన్ని స్వాగతించగా.. కశ్మీర్‌కు చెందిన పార్టీలు మాత్రం దీన్ని వ్యతిరేకించాయి.

370.. భాజపా మూల సిద్ధాంతం

‘ఆర్టికల్‌ 370 రద్దు సంతోషకర విషయం. జాతీయ సమగ్రత బలోపేతం దిశగా ఇదో గొప్ప ముందడుగు. ఆర్టికల్‌ 370 రద్దు భాజపా మూల సిద్ధాంతాల్లో ఒకటి. జనసంఘ్‌ రోజుల నుంచే ఈ ప్రతిపాదన ఉంది’’

- ఎల్‌కే అడ్వాణీ, భాజపా అగ్రనేత

‘370 రద్దు.. చరిత్రాత్మకం’కేంద్రానికి తెదేపా మద్దతు
‘‘జమ్మూకశ్మీర్‌ స్వయంప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్‌ 370 రద్దు విషయంలో కేంద్రం నిర్ణయానికి తెదేపా మద్దతిస్తోంది. జమ్మూకశ్మీర్‌ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థిస్తున్నా’’

-చంద్రబాబు, తెదేపా అధినేత

అభినవ వల్లభాయ్‌ పటేల్‌.. షా‘370 రద్దు.. చరిత్రాత్మకం’
‘‘భారత పార్లమెంటులో కేంద్రమంత్రి అమిత్‌ షా ధైర్యమైన నిర్ణయం తీసుకున్నారు. చారిత్రక బిల్లులను ప్రవేశపెట్టిన ఆయనకు హ్యాట్సాఫ్‌. కాంగ్రెస్‌ నిర్వాకం వల్లే ఇన్నేళ్లు ఈ బిల్లు నానుతూ వచ్చింది. అమిత్‌షా అభినవ వల్లభాయ్‌ పటేల్‌. కొన్నేళ్లుగా దేశాన్ని పీడిస్తున్న సమస్యను ఒక కొలిక్కి తెచ్చారు. జాతీయ పతాకాన్ని దహనం చేస్తుంటే చర్యలు తీసుకోకపోవడాన్ని కశ్మీర్‌లోనే చూస్తున్నాం. దేశానికి రెండు రాజ్యాంగాలు ఎక్కడుంటాయి?’

- విజయ సాయి రెడ్డి, వైకాపా ఎంపీ

కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
‘‘జమ్మూకశ్మీర్‌ అంశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. జమ్మూ కశ్మీర్‌ ప్రజలు సంతోషంగా జీవించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలి. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సమాన హక్కులు ఉండాలి.

-కనక మేడల రవీంద్రకుమార్‌, రాజ్యసభలో తెదేపా ఎంపీ

‘370 రద్దు.. చరిత్రాత్మకం’కల నెరవేరింది

‘‘స్వతంత్ర భారతం అన్న మాట ఇవాళ పరిపూర్ణమైంది. కేంద్రం తీసుకున్న ఈ చారిత్రక నిర్ణయంతో దివంగత నేతలు వాజ్‌పేయీ, బాల్‌ ఠాక్రే స్వప్నం నెరవేరినట్టయింది. చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షాకు అభినందనలు.

-ఉద్దవ్‌ ఠాక్రే , శివసేన అధినేత 

అందుకే ఎన్డీయేకు మద్దతిచ్చాం
‘‘ఆర్టికల్‌ 370 రద్దు చరిత్రాత్మక నిర్ణయం. మోదీ, అమిత్‌షాకు ధన్యవాదాలు. అందుకే 2019 ఎన్నికల్లో మోదీ నేతృత్వంలోని ఎన్డీయేకు మద్దతిచ్చాం. 370 రద్దుతో జమ్ముకశ్మీర్‌ ఇప్పుడు దేశంలో భాగమైంది. ఇకపై జమ్ముకశ్మీర్‌ శాంతి, పురోగతి, శ్రేయస్సు వికసిస్తుందని ఆశిస్తున్నాం’’ 

-ఆదిత్య ఠాక్రే, శివసేన యువ నేత

ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం‘370 రద్దు.. చరిత్రాత్మకం’
‘‘జమ్మూకశ్మీర్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. ఈ నిర్ణయంతో ఆ రాష్ట్రంలో శాంతి, అభివృద్ధి జరుగుతాయని ఆశిస్తున్నా’’

- కేజ్రీవాల్‌, దిల్లీ ముఖ్యమంత్రి

‘అమ్మ’కోరికిదే..
‘‘దేశమంతా ఐకమత్యంగా ఉండాలనేది ‘అమ్మ’ జయలలిత ఉద్దేశం. కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులకు మేం మద్దతిస్తున్నాం’ ’

- నవనీత కృష్ణన్‌, అన్నాడీఎంకే ఎంపీ

దేశమే మాకు ముఖ్యం
‘‘జమ్మూకశ్మీర్‌ కూడా భారత్‌లో భాగమైపోయింది. ఈ పరిణామానికి మా పార్టీ మద్దతిస్తోంది. మేం ప్రాంతీయ పార్టీకి చెందిన వారిమే అయినా.. దేశమే మాకు ముఖ్యం’’

- ప్రసన్న ఆచార్య, బిజూ జనతా దళ్‌ ఎంపీ

కశ్మీర్‌కు ఇచ్చిన మాట తప్పారని పీపుల్స్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ పార్టీ నేత మహ్మద్‌ ఫయాజ్‌ విమర్శించారు. ఇది చారిత్రక నిర్ణయం కాదని.. చారిత్రిక తప్పిదమని అభివర్ణించారు. మరోవైపు ఈ బిల్లును కాంగ్రెస్‌ పార్టీ కూడా వ్యతిరేకించింది. భారత రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం కూనీ చేసిందని, ఎన్నో ఏళ్లుగా కాపాడుకుంటూ వచ్చిన నిబంధనలకు భాజపా తూట్లు పొడిచిందని ఆ పార్టీక నేత గులాంనబీ ఆజాద్‌ పేర్కొన్నారు. దీంతో పాటు తమిళనాడుకు చెందిన ఎండీఎంకకే నేత వైగో సైతం ఈ బిల్లును తప్పపట్టారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.