close

తాజా వార్తలు

‘చిత్ర’ వార్తలు

తల్లి పోరాటం.. బిడ్డ ఆరాటం!

చిత్రంలో (వృత్తంలో) కనిపిస్తున్న మహిళ పేరు స్వర్ణ. కర్నూలు జిల్లా జలదుర్గం మండలం హుస్సేన్‌పురం గ్రామం నుంచి విజయవాడ వచ్చింది. వృత్తిరీత్యా ఏఎన్‌ఎం. ఒప్పంద ఏఎన్‌ఎంలను క్రమబద్ధీకరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 వేలమంది ఏఎన్‌ఎంలు విజయవాడ ధర్నాచౌక్‌లో సోమవారం ఆందోళన చేశారు. స్వర్ణ తన తొమ్మిది నెలల పాప అర్చనతో ధర్నాకు వచ్చింది. బిడ్డను తన తల్లికి అప్పగించి స్వర్ణ ధర్నాలో కూర్చుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆందోళన కొనసాగింది. దీంతో తల్లిపాల కోసం పాప విలవిలాడింది. అర్చన పుట్టుకతోనే కిడ్నీ సంబంధిత వ్యాధితో పుట్టింది. వైద్యానికి ఇప్పటి వరకు రూ.8 లక్షలు ఖర్చుచేశారు. ఉద్యోగ కాలపరిమితి ముగియడంతో క్రమబద్ధీకరించపోతే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందని ధర్నాకు వచ్చినట్టు స్వర్ణ తెలిపింది.

సొంత గూటి కోసం..

ఉగాది నాటికి నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో దరఖాస్తులు అందజేసేందుకు ప్రజలిలా బారులు తీరారు. సొంతిళ్లు లేని వారు గత మూడు వారాలుగా స్పందన కార్యక్రమంలో దరఖాస్తు చేస్తున్నారు. సోమవారం స్పందన కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు.

జల విలయం

కర్ణాటకలో వరద ప్రభావిత ప్రాంతాలను హెలికాప్టర్‌ నుంచి పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి యడియూరప్ప. కుండపోత వర్షాలతో కర్ణాటకలో పలు జిల్లాలు నీట మునిగాయి. బెళగావి జిల్లాలో అత్యంత అప్రమత్తత (హైఅలర్ట్‌) ప్రకటించారు.

  1. భక్తి పారవశ్యం

నాగపంచమి పురస్కరించుకుని మధ్యప్రదేశ్‌ జబల్‌పూర్‌లో శివలింగాలకు అభిషేకం చేస్తున్న కిన్నార్‌ అఖాడా సభ్యులు

రైలెప్పుడొస్తుందో..!

మహారాష్ట్రలో వర్షాలు సోమవారం కూడా కొనసాగాయి. ఠానేలో రైలు పట్టాలు నీట మునిగాయి. దీంతో అధికారులు స్థానిక రైలు సర్వీసులు నిలిపివేశారు. సమాచార లోపంతో రైలు కోసం రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు ఇలా కిక్కిరిసి కనిపించారు.

ఇదో రకం ఉపాధి

ఏపీలో స్పందన కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తోంది. అర్జీలు పెట్టుకున్నవారి సమస్యలను అధికారులు త్వరితగతిన పరిష్కరిస్తున్నారు. దీంతో దరఖాస్తుదారుల సంఖ్య ప్రతి వారం పెరుగుతోంది. నిరక్ష్యరాసులకు అర్జీ రాయడంలో లేఖరులు సాయం చేస్తున్నారు. ఒక్కో వినతి పత్రానికి రూ.10 తీసుకుంటున్నారు. దీంతో అటు దరఖాస్తుదారునికి పని సులువవుతోంది. ఇటు లేఖరికీ ఉపాధి దొరుకుతుంది. వందల సంఖ్యలో దరఖాస్తుదారులు రావడంతో ఒక్క రోజులో రూ.300-400 వరకు సంపాదిస్తున్నట్లు లేఖరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.