close

తాజా వార్తలు

పట్టాలు తప్పిన గూడ్స్‌.. పలు రైళ్ల రద్దు

భువనేశ్వర్‌: ఆంధ్రా సరిహద్దు ఒడిశా రాష్ట్రంలోని అంబోదల-దోయికళ్లు రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్‌ రైలు ఒకటి పట్టాలు తప్పింది. ఎగువ ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరద నీటికి పట్టాలు దెబ్బతినడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆ మార్గంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. ట్రాక్ పునరుద్ధరించేంత వరకు ఆ మార్గంలో వెళ్లే ఎనిమిది రైళ్లను రద్దు చేస్తున్నామని, మరో ఐదు రైళ్లను దారి మళ్లిస్తున్నామని తెలిపారు.

రద్దైన రైళ్లు వివరాలు
1. సంబల్పూర్- కొరాపుట్‌ ప్యాసింజర్‌
2. కొరాపుట్- సంబల్పూర్ ప్యాసింజర్

3. సంబల్పూర్‌ - జనఘర్‌ రోడ్ ప్యాసింజర్
4. జనఘర్‌ ‌- సంబల్పూర్ ప్యాసింజర్
5. రాయపూర్-విశాఖ ప్యాసింజర్
6. విశాఖ - రాయపూర్‌ ప్యాసింజర్ 
7. సంబల్పూర్‌- రాయగడ ఎక్స్‌ప్రెస్‌
8. రాయగడ- సంబల్పూర్ ఎక్స్‌ప్రెస్‌

దారి మళ్లించిన రైళ్ల వివరాలు
1.పూరి- ఆహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్‌
2.అహ్మదాబాద్- పూరి ఎక్స్‌ప్రెస్‌
3.బెంగళూరు- హతియా ఎక్స్‌ప్రెస్‌
4. ధన్‌బాద్‌- అలెప్పీ ఎక్స్‌ప్రెస్‌
5. విశాఖ - నిజాముద్దీన్ సమతా ఎక్స్‌ప్రెస్‌.. మరికొన్ని రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి.

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.