close

తాజా వార్తలు

అమలులోకి వన్‌ నేషన్‌ -వన్‌ రేషన్‌ కార్డు

హైదరాబాద్‌‌: దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలకు ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా కేంద్రం ఒకే దేశం - ఒకే రేషన్‌కార్డు విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలులోకి తెచ్చింది. ఈ పథకంలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌కు రెండు క్లస్టర్లుగా రేషన్‌ పంపిణీ ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ఆహార భద్రతా శాఖ మంత్రి రాంవిలాస్‌ పాసవాన్‌ దిల్లీ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా శుక్రవారం ప్రారంభించారు. హైదరాబాద్‌ ఆదర్శనగర్‌ కాలనీలోని న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌, విజయవాడలోని ఓ చౌక ధరల దుకాణంలో ఈ విధానం ద్వారా తొలిసారి వినియోగదారులకు రేషన్‌ పంపిణీ చేశారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అకున్‌ సబర్వాల్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ‘వన్‌ నేషన్‌ - వన్‌ రేషన్‌ కార్డు’ విధానం అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. నేషనల్‌ పోర్టబులిటీ తెలంగాణ - ఏపీ క్లస్టర్‌ ద్వారా సేవలందించనున్నట్టు తెలిపారు. ఇరు రాష్ట్రాల్లో ఎక్కడైనా రేషన్‌ సరుకులు తీసుకోవచ్చన్నారు. దీనివల్ల హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ వాసులకు ఎక్కువగా లబ్ధి చేకూరుతుందన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.