close

తాజా వార్తలు

కేరళ, కర్ణాటలో కొనసాగుతున్న భారీవర్షాలు

రెండు రాష్ట్రాల్లో 88 మంది మృతి

దిల్లీ: దక్షిణాది రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. కేరళలో గతేడాది పరిస్థితికి ఏ మాత్రం తీసి పోకుండా ఈ ఏడాది కూడా వర్షాలు కురుస్తున్నాయి. వర్ష సంబంధ ఘటనల్లో మృతి చెందిన వారి సంఖ్య 57కు చేరింది. వయనాడ్‌, మలప్పురం జిల్లాల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో రెడ్‌ అలెర్ట్‌ కొనసాగుతోంది. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వయనాడ్‌, మలప్పురం జిల్లాల్లో కొండ చరియలు విరిగి పడటంతో దాదాపు 60 మంది వాటి కింద చిక్కుకున్నట్లు అంచనా. వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ఈరోజు సాయంత్రం వయనాడ్‌లో పర్యటించనున్నారు. రాహుల్‌ ఇక్కడే రెండు రోజుల పాటు ఉంటారని కేరళ పీసీసీ చీఫ్‌ రామచంద్రన్‌ తెలిపారు. వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

కర్ణాటకలో...
కర్ణాటకలోనూ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాలు, వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య ఆదివారం నాటికి 31కి చేరింది. దక్షిణ కన్నడ, ఉడిపి, ఉత్తర కన్నడ, శివమొగ్గ, చిక్‌మగళూరు, కొడగు, హాసన్‌ జిల్లాల్లో సోమవారం వరకు రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సక్లేశ్‌పూర్‌- సుబ్రమణ్య మధ్య రైలు పట్టాలపై కొండచరియలు విరిగి పడటంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. కేంద్రమంత్రి అమిత్‌ షా ఈరోజు మధ్యాహ్నం బెళగావి జిల్లాలో ఏరియల్‌ సర్వే చేయనున్నారు. ముఖ్యమంత్రి యడియూరప్పతో కలిసి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మరోవైపు ఇదే అదనుగా పలు విమాన యాన సంస్థలు కూడా టికెట్ల రేట్లను అమాంతం పెంచేశాయి. ఉత్తర కన్నడలో వర్షం కారణంగా రూ.6 వేల కోట్ల నష్టం వాటిల్లిందని సీఎం యడియూరప్ప శనివారం తెలిపారు. వర్షం కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈనెల 15 వరకు సెలవు ప్రకటించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.