Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 141416
            [news_title_telugu_html] => ‘భాజపానే ఎంఐఎంతో కలిసి వెళ్లొచ్చు కదా!’
            [news_title_telugu] => ‘భాజపానే ఎంఐఎంతో కలిసి వెళ్లొచ్చు కదా!’
            [news_title_english] => Talasani counter on BJP laxman comments
            [news_short_description] => రాష్ట్రంలో కల్వకుంట్ల వారి ప్రభుత్వం నడుస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ సోమవారం చేసిన విమర్శలపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పందించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అని అంటున్నారు కదా..

            [news_tags_keywords] => Talasani,TRS,Laxman,BJP,ts politics
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-14 01:38:33
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
‘భాజపానే ఎంఐఎంతో కలిసి వెళ్లొచ్చు కదా!’ - Talasani counter on BJP laxman comments - EENADU
close

తాజా వార్తలు

‘భాజపానే ఎంఐఎంతో కలిసి వెళ్లొచ్చు కదా!’

లక్ష్మణ్‌ విమర్శలకు మంత్రి తలసాని కౌంటర్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో కల్వకుంట్ల వారి ప్రభుత్వం నడుస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ సోమవారం చేసిన విమర్శలపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పందించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అని అంటున్నారు కదా.. అలాగే తెలంగాణలో కూడా కల్వకుంట్ల వారి ప్రభుత్వమే నడుస్తోందన్నారు. అయినా.. ఆ సందేహం లక్ష్మణ్‌కు ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎంఐఎం పార్టీతో కలిసిపోతున్నారంటూ తెరాసపై విమర్శలు చేయడమెందుకు? పాతబస్తీలో భాజపా బలోపేతానికి ఎంఐఎంతో మీరే కలిసి వెళ్లొచ్చు కదా. పుల్వామా ఘటన జరిగినప్పుడు ఎంఐఎం నేతలు మోదీకి మద్దతు తెలిపారు. 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 119 స్థానాల్లో పోటీచేస్తే 113 స్థానాల్లో  డిపాజిట్లు కూడా రాలేదు. వేరే పార్టీల వాళ్లు అంటరానివాళ్లు అనే భావన మాకు లేదు. దేశంలో ఏ పార్టీ వారు వసతి గృహాల్లో సన్నబియ్యం పెట్టాలని ఎవరైనా అడిగారా? మేమే చేశాం కదా! ఏ ప్రభుత్వమైనా రూ.20లక్షల ఉపకార వేతనంతో విద్యార్థులను విదేశాలకు పంపాయా? అప్పులు చేశారు అంటున్నారు.. ఎవరి కోసం అప్పులు చేశాం? కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం నడుస్తోంది గనకే ఇన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టగలుగుతున్నాం. మీరు దిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి జాతీయ ప్రాజెక్టులు, నిధులు రాష్ట్రానికి తీసుకొస్తే ప్రజలు మిమ్మల్ని ప్రశంసిస్తారు కదా’’ అని తలసాని వ్యాఖ్యానించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.