Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143388
            [news_title_telugu_html] => 

సంక్రాంతి లోపు పార్టీ ప్రకటన?

[news_title_telugu] => సంక్రాంతి లోపు పార్టీ ప్రకటన? [news_title_english] => Will rajani announce the party? [news_short_description] => సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ వచ్చే ఏడాది సంక్రాంతిలోపు కొత్త పార్టీ ప్రారంభించనున్నారా? అంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ‘ఔను’ అనే సమాధానాన్నే ఇస్తున్నాయి. శాసనసభ ఎన్నికలే తమ లక్ష్యమని ఆయన ప్రకటించిన నేపథ్యంలో అందుకు ముమ్మరంగా కసరత్తులు చేస్తున్నారు. [news_tags_keywords] => RajaniKanth,Tamilanadu,Political Party [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-17 09:37:15 [news_isactive] => 1 [news_status] => 2 ) )
సంక్రాంతి లోపు పార్టీ ప్రకటన? - Will rajani announce the party? - EENADU
close

తాజా వార్తలు

సంక్రాంతి లోపు పార్టీ ప్రకటన?

నటుడు రజనీకాంత్‌ సన్నాహాలు
శాసనసభ ఎన్నికల్లో పోటీకి ఏర్పాట్లు

చెన్నై, న్యూస్‌టుడే: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ వచ్చే ఏడాది సంక్రాంతిలోపు కొత్త పార్టీ ప్రారంభించనున్నారా? అంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ‘ఔను’ అనే సమాధానాన్నే ఇస్తున్నాయి. శాసనసభ ఎన్నికలే తమ లక్ష్యమని ఆయన ప్రకటించిన నేపథ్యంలో అందుకు ముమ్మరంగా కసరత్తులు చేస్తున్నారు. అందులో భాగంగానే సంక్రాంతిలోపు పార్టీ ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. తాజాగా కరాటే త్యాగరాజన్‌ చేసిన వ్యాఖ్యలు వాటికి అద్దం పడుతున్నాయి. శాసనసభ ఎన్నికలు మాత్రమే తమ లక్ష్యమంటూ ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రజనీకాంత్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వచ్చే శాసనసభ ఎన్నికల్లో కచ్చితంగా ఆయన పోటీ చేస్తారని తెలుస్తోంది. అయితే రాజకీయ ప్రవేశం గురించి ప్రకటించి రెండేళ్లవుతున్నా పార్టీని మాత్రం ఆయన ప్రారంభించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో తాజాగా రజనీకాంత్‌ వైఖరి ఆయన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణపై పలు ఊహాగానాలను తెరపైకి తీసుకొచ్చింది. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గురించి పాత్రికేయులు అడిగే ప్రశ్నలకు సున్నితంగా సమాధానం ఇవ్వడమో, స్పందించకుండా వెళ్లిపోవడమే జరిగేది. ప్రస్తుతం ఆ వైఖరి పూర్తిగా మారింది. తన స్పందనను కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. కశ్మీర్‌ వ్యవహారంలో భాజపా నిర్ణయంపై రజనీ చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. దీంతో ఆయన త్వరలో పార్టీని ప్రారంభించనున్నారనే వార్తలు వినిపించాయి. 2017 డిసెంబరు 31న తన రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించి 2018వ ఏడాదికి అభిమానులకు కానుక అందించినట్టే... ఈ ఏడాది ఆఖరులో కొత్త పార్టీ పేరు, జెండా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. సంక్రాంతి కానుకగా కూడా పార్టీ పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలూ ఉన్నాయి. దీనిని రజనీకాంత్‌కు సన్నిహిత మిత్రుడు, కాంగ్రెస్‌ ప్రముఖుడు కరాటే త్యాగరాజన్‌ వ్యాఖ్యలు నిర్ధారిస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రజనీకాంత్‌ పార్టీ ప్రారంభిస్తారని, అప్పుడు కచ్చితంగా తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరుణానిధి, జయలలిత లేని శూన్యతను ఆయన మాత్రమే భర్తీ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

కొద్దిరోజులు సంయమనం
ఈ వార్తలు తమిళనాట రాజకీయ పక్షాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రజనీని కేంద్రంగా చేసుకుని రాష్ట్ర రాజకీయాలు తిరుగుతాయనే విశ్లేషణలు సైతం తెరపైకి వస్తున్నాయి. కేంద్రంలోని భాజపా నాయకులతో రజనీకాంత్‌కు ఉన్న సాన్నిహిత్యం ఇటీవల మరింత బహిర్గతం కావడంతో పార్టీ ప్రారంభించిన తర్వాత ఆ పార్టీతో రజనీకాంత్‌ పొత్తు పెట్టుకుంటారనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. మోదీ, అమిత్‌షాలను కృష్ణార్జునులతో పోల్చడం, కశ్మీర్‌ పునర్విభజనపై భాజపా సర్కార్‌ను అభినందించడం వంటి ఘటనలతో రాష్ట్రంలోని భాజపాయేతర పక్షాలు రజనీకాంత్‌పై ధ్వజమెత్తాయి. ఇంతలో రజనీకాంత్‌కు మద్దతుగా భాజపా రాష్ట్ర నేతలు గళం విప్పడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. వీటి ద్వారా తర్వాతి ఎన్నికల్లో భాజపాతో రజనీకాంత్‌ పొత్తు పెట్టుకుంటారనే ఊహాగానాలు బయలుదేరాయి. వీటిని రజనీకాంత్‌ సన్నిహితవర్గాలు కొట్టిపారేస్తున్నాయి. పార్టీ ప్రారంభించిన కొద్దిరోజులు ప్రజల నాడి చూడాలని, అప్పటివరకు ఇతర ప్రధాన పార్టీలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని సమాచారం. అందువల్ల ప్రజలు, అభిమానుల మనోభావాలు తెలుసుకున్న తర్వాత కూటమి గురించి ఆలోచిస్తారని, అప్పటివరకు ముఖ్య పార్టీల రాజకీయ నేతలకు ఆయన దూరంగానే ఉంటారని సన్నిహితులు చెబుతున్నారు.

దాని అంతరార్థం ఏంటో?: జయలలిత మృతికి ముందు వరకు పోయెస్‌గార్డెన్‌ తమిళనాడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం అదే ప్రాంతంలో నివసిస్తున్న రజనీకాంత్‌ చుట్టూ తమిళనాడు రాజకీయాలు తిరిగే అవకాశముందని, అందువల్ల మళ్లీ పోయెస్‌గార్డెన్‌ కీలకం కానుందని విశ్లేషణలు తెరపైకి వచ్చాయి. దీని గురించి కొద్దిరోజుల కిందట ఓ విలేకరి ప్రశ్నించగా ‘ఇప్పుడు చెప్పబోనని, నిరీక్షించి చూడండి’ అంటూ తనదైన శైలిలో రజనీకాంత్‌ సమాధానం చెప్పారు. ఆ జవాబు వెనుక అంతరార్థం ఏమై ఉంటుందనే ప్రశ్న ప్రస్తుతం ఉత్కంఠ రేపింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.