Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143420
            [news_title_telugu_html] => 

‘అవినీతిలో నంబర్‌ వన్‌ కేసీఆర్‌ ప్రభుత్వం’

[news_title_telugu] => ‘అవినీతిలో నంబర్‌ వన్‌ కేసీఆర్‌ ప్రభుత్వం’ [news_title_english] => bjp laxman fires on kcr [news_short_description] => రాష్ట్రంలో అవినీతికి అదుపు లేకుండా పోయిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. ప్రజా సేవలు అందించాల్సిన ప్రజాప్రతినిధులు కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారన్నారు.  [news_tags_keywords] => bjp,laxman,kcr,ts news [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => 2hhgF42dcJ4 [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-17 12:46:20 [news_isactive] => 1 [news_status] => 2 ) )
‘అవినీతిలో నంబర్‌ వన్‌ కేసీఆర్‌ ప్రభుత్వం’ - bjp laxman fires on kcr - EENADU
close

తాజా వార్తలు

‘అవినీతిలో నంబర్‌ వన్‌ కేసీఆర్‌ ప్రభుత్వం’

ప్రతి పథకంలో కమీషన్‌ : భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌


హైదారాబాద్‌: రాష్ట్రంలో అవినీతికి అదుపు లేకుండా పోయిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. ప్రజా సేవలు అందించాల్సిన ప్రజాప్రతినిధులు కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో నెంబర్ వన్‌గా తేలిందని మండిపడ్డారు. కాళేశ్వరాన్ని మానస పుత్రికగా చెప్పుకొనే కేసీఆర్ రూ.30వేల కోట్ల ప్రాజెక్టును రూ. లక్ష కోట్లకు పెంచి 6 శాతం కమీషన్ దండుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకంలో కమీషన్ తీసుకుంటున్నారన్నారు. చంద్రబాబును బూచిగా చూపెట్టి అధికారంలోకి వచ్చి ప్రజా సంక్షేమాన్ని ఆటకెక్కించారని దుయ్యబట్టారు. 

‘రూ.500 కోట్లు వృథా చేసి అసెంబ్లీ కడతామంటూ చెబుతున్న కేసీఆర్‌.. ఆరోగ్యశ్రీ బకాయిలు మాత్రం చెల్లించట్లేదు. బస్తీల్లో పేదలు డెంగీ, మలేరియా వ్యాధులతో మంచాన పడితే పట్టించుకునేవారే  లేరు. ప్రభుత్వం జారీ చేసే జీవోలు వెబ్‌సైట్‌లో పెట్టకుండా ప్రజలను మోసం చేస్తున్నారు.5 శాఖలు జారీ చేసిన 1400 జీవోలు వెబ్‌సైట్‌లో కనపడకుండా చేశారు. పార్టీ కార్యాలయాలకు రూపాయికి ఎకరం ఇస్తూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. డీపీఆర్ లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు పథకం అంటూ ప్రజలకు రంగుల సినిమా చూపెడుతున్నారు. తెలంగాణా రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చేశారు. పార్టీకి ఆకర్షితులై భాజపాలో చేరుతుంటే అవుట్‌ డేటెడ్ నాయకులంటూ వారిని ఎద్దేవా చేస్తున్నారు. కేటీఆర్‌ పరమత సహనం గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. దానిగురించి మాట్లాడే ముందు,  హిందూ దేవతలను అవమానించిన ఒవైసీపై చర్యలు తీసుకోవాలి. కాళేశ్వరం డీపీఆర్ ఇవ్వకుండా జాతీయ హోదా అడగడం ఎంతవరకు సమంజసమో  ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. డీపీఆర్ ఇవ్వకపోయినా.. తెలంగాణా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చింది’ అని లక్ష్మణ్‌ అన్నారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.