Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143980
            [news_title_telugu_html] => 

‘కమల్‌ సినిమాల్లో మాత్రమే సీఎం కాగలరు’

[news_title_telugu] => ‘కమల్‌ సినిమాల్లో మాత్రమే సీఎం కాగలరు’ [news_title_english] => Kamal Haasan can be a CM only in films TN Minister [news_short_description] => కమల్‌ హాసన్‌ కేవలం సినిమాల్లో మాత్రమే ముఖ్యమంత్రి కాగలరని అది నిజ సాధ్యం కాదని అన్నాడీఎంకే నేత తమిళనాడు మంత్రి సెళ్లూర్‌ కె రాజు విమర్శించారు.... [news_tags_keywords] => Tamilnadu,MNM,AIADMK,Kamal Hassan [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-18 18:12:28 [news_isactive] => 1 [news_status] => 2 ) )
‘కమల్‌ సినిమాల్లో మాత్రమే సీఎం కాగలరు’ - Kamal Haasan can be a CM only in films TN Minister - EENADU
close

తాజా వార్తలు

‘కమల్‌ సినిమాల్లో మాత్రమే సీఎం కాగలరు’

చెన్నై: కమల్‌ హాసన్‌ కేవలం సినిమాల్లో మాత్రమే ముఖ్యమంత్రి కాగలరని.. నిజ జీవితంలో సాధ్యం కాదని అన్నాడీఎంకే నేత తమిళనాడు మంత్రి సెళ్లూర్‌ కె రాజు విమర్శించారు. క్షేత్ర స్థాయిలో కమల్‌ తన పార్టీ మక్కల్‌ నీది మయ్యం(ఎమ్‌ఎన్‌ఎమ్‌)ని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని వస్తున్న వార్తలపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ప్రజలు కమల్‌ని ముఖ్యమంత్రిగా ఎప్పటికీ అంగీకరించలేరన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆ విషయం తేటతెల్లమైందన్నారు. పార్టీ స్థాపించిన సమయంలో సినిమాల్లో నటించబోనని హామీ ఇచ్చారని.. కానీ, దాన్ని నిలుపుకోవడంలో కమల్‌ విఫలమయ్యారన్నారు. సినిమా రంగం నుంచి వచ్చిన వారిలో ఎంజీఆర్‌ తప్ప ఇంకెవరూ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించలేరన్నారు. 

ప్రజలు కమల్‌ హాసన్‌ని కీలక నేతగా భావించడం లేదని రాజు అన్నారు. అదే సమయంలో తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ని ప్రశంసించారు. అధికరణ 370 రద్దుని సమర్థిస్తూ.. రజనీ చేసిన వ్యాఖ్యల్ని ఆయన స్వాగతించారు. మరోవైపు రాజు వ్యాఖ్యల్ని ఎమ్‌ఎన్‌ఎమ్‌ పార్టీ ఖండించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి మురళీ అబ్బాస్‌ మాట్లాడుతూ.. ఎమ్‌ఎన్‌ఎమ్‌ వృద్ధిని ఓర్వలేకే అన్నాడీఎంకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఐదు శాతం ఓట్లు సంపాదించామని.. 2021లో జరగబోయే శాసనసభ ఎన్నికలో గణనీయ సంఖ్యలో సీట్లు సాధిస్తామన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.