Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143984
            [news_title_telugu_html] => 

మోదీపై శతృఘ్న సిన్హా ప్రశంసలు

[news_title_telugu] => మోదీపై శతృఘ్న సిన్హా ప్రశంసలు [news_title_english] => Shatrughan Sinha hails modi over his independence day speech [news_short_description] => ప్రధాని మోదీ పనితీరుపై నిత్యం విమర్శలు గుప్పించే కాంగ్రెస్‌ నేత శతృఘ్న సిన్హా.. తాజాగా ఆయనపై ప్రశంసలు కురిపించి అందరినీ ఆశ్చరపరిచారు. ప్రధాని స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా ఎర్రకోట............... [news_tags_keywords] => Shatrughan Sinha,BJP,Congress,Modi [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-18 17:53:13 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మోదీపై శతృఘ్న సిన్హా ప్రశంసలు - Shatrughan Sinha hails modi over his independence day speech - EENADU
close

తాజా వార్తలు

మోదీపై శతృఘ్న సిన్హా ప్రశంసలు

దిల్లీ: ప్రధాని మోదీ పనితీరుపై నిత్యం విమర్శలు గుప్పించే కాంగ్రెస్‌ నేత శతృఘ్న సిన్హా.. తాజాగా ఆయనపై ప్రశంసలు కురిపించి అందరినీ ఆశ్చరపరిచారు. ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా చేసిన ప్రసంగాన్ని ఆయన ప్రశంసించారు. ‘‘ ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం చాలా ధైర్యవంతంగా ఉంది. బాగా శోధించి చేసిన ఆయన మాటలు ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యల్ని బాగా లేవనెత్తారు’’ అని ఆదివారం ట్వీట్‌ చేశారు.

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా భాజపా నుంచి కాంగ్రెస్‌లో చేరిన శతృఘ్న సిన్హా.. పార్టీలో ఉండగానే మోదీపై అనేక సార్లు విమర్శలు గుప్పించారు. భాజపా ‘టూ మ్యాన్ ఆర్మీ, వన్‌ మ్యాన్‌ షో’గా మారిందని ఆరోపించారు. పర్యవసానంగా ఆయనకు భాజపా లోక్‌సభ ఎన్నికల్లో సీటు కేటాయించలేదు. దీంతో కాంగ్రెస్‌ కండువా కప్పుకొని తన సిట్టింగ్‌ స్థానమైన పట్నా సాహిబ్‌ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.