Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144042
            [news_title_telugu_html] => 

కాంగ్రెస్‌కు షాక్‌: కేంద్రానికి మాజీ సీఎం మద్దతు

[news_title_telugu] => కాంగ్రెస్‌కు షాక్‌: కేంద్రానికి మాజీ సీఎం మద్దతు [news_title_english] => Bhupinder Singh Hooda backs Centres Article 370 move [news_short_description] => జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు విషయంలో కాంగ్రెస్‌ పార్టీ మరో ఝలక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, హరియాణా మాజీ ముఖ్యమంత్రి.... [news_tags_keywords] => Bhupinder Singh Hooda,Article 370,congress,politics [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-18 18:42:09 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కాంగ్రెస్‌కు షాక్‌: కేంద్రానికి మాజీ సీఎం మద్దతు - Bhupinder Singh Hooda backs Centres Article 370 move - EENADU
close

తాజా వార్తలు

కాంగ్రెస్‌కు షాక్‌: కేంద్రానికి మాజీ సీఎం మద్దతు

న్యూదిల్లీ: జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు విషయంలో కాంగ్రెస్‌ పార్టీ మరో ఝలక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపీందర్‌సింగ్‌ హుడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ప్రకటించారు. దేశభక్తి, ఆత్మాభిమానం విషయంలో రాజీపడే అవకాశమే లేదని కుండబద్దలు కొట్టారు. రోహ్‌తక్‌లో నిర్వహించిన మహాపరివర్తన్‌ ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ సరైన మార్గంలో వెల్లడం లేదని విమర్శించారు.
‘‘ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే దానికి నేను మద్దతిస్తా. ఆర్టికల్‌ 370 రద్దు విషయంలో చాలా మంది నా సహచరులు (కాంగ్రెస్‌ నేతలు) ఆ నిర్ణయాన్ని తప్పుపట్టారు. కశ్మీర్‌లో మన సోదరులు (హరియాణా) జవాన్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. నేను కూడా దేశభక్తి కలిగిన కుటుంబం నుంచి వచ్చా. దేశభక్తి, ఆత్మాభిమానం విషయంలో అస్సలు రాజీ పడబోను’’ అని హుడా చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఈ ఐదేళ్లలో మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందని ప్రశ్నించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీ తరహాలో 75 శాతం స్థానికులకే రిజర్వేషన్లు కల్పించే చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ఆయన కాంగ్రెస్‌ను వీడి మరో కొత్త పార్టీని నెలకొల్పే యోచనలో ఉన్నట్లు ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అక్టోబర్‌లో హరియాణా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.