Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144070
            [news_title_telugu_html] => 

ఆ కుట్రపైనా సీబీఐ విచారణ జరపాలి

[news_title_telugu] => ఆ కుట్రపైనా సీబీఐ విచారణ జరపాలి [news_title_english] => Want CBI Investigation on Operation Lotus also demands Siddaramaiah [news_short_description] => కర్ణాటకలో జేడీఎస్‌-కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా అమలు చేసిన ‘ఆపరేషన్‌ లోటస్‌’పైనా సీబీఐ విచారణ జరిపించాలని ... [news_tags_keywords] => Siddaramaiah, CBI, Operation Lotus, Karnataka Politics, Phone Tapping [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 00:22:40 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఆ కుట్రపైనా సీబీఐ విచారణ జరపాలి - Want CBI Investigation on Operation Lotus also demands Siddaramaiah - EENADU
close

తాజా వార్తలు

ఆ కుట్రపైనా సీబీఐ విచారణ జరపాలి

కాంగ్రెస్‌ నేత సిద్దరామయ్య డిమాండ్‌

బెంగళూరు: కర్ణాటకలో జేడీఎస్‌-కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా అమలు చేసిన ‘ఆపరేషన్‌ లోటస్‌’పైనా సీబీఐ విచారణ జరిపించాలని మాజీ సీఎం సిద్దరామయ్య డిమాండ్‌ చేశారు. భాజపా నాయకుల ‘ఫోన్‌ ట్యాపింగ్‌’ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించిన నేపథ్యంలో సిద్దరామయ్య ట్విటర్‌ ద్వారా స్పందించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి అప్పగిస్తామన్న భాజపా నిర్ణయాన్ని మేం  స్వాగతిస్తున్నాం. కానీ గతంలో భాజపా తన రాజకీయ ప్రయోజనాల కోసం సీబీఐని వాడుకుంది. ఈసారి ఇలాంటి ధోరణి లేదని భావిస్తున్నాం’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై రేపే సీబీఐ విచారణకు ఆదేశిస్తానని, ఇందులో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్దరామయ్య సహా ముఖ్యమైన నాయకుల పేర్లు బయటకు రానున్నాయని యడియూరప్ప ఆదివారం విలేకరులతో అన్నారు. 
బొటాబొటి మెజారిటీతో గతేడాది జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పర్చగా, రెండు పార్టీల్లోని దాదాపు 15 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో ప్రభుత్వం గత నెలలో కూలిపోయిన సంగతి తెలిసిందే. దీంతో మళ్లీ యడియూరప్ప అధికారాన్ని చేపట్టారు. అయితే, తమ ప్రభుత్వం కూలిపోయేందుకు భాజపా కుట్ర పన్నిందని కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఆరోపిస్తున్నాయి. డబ్బు ఆశచూపి ఎమ్మెల్యేలను రాజీనామా చేయించారని అంటున్నాయి.
మరోవైపు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగాన్ని ప్రభావితం చేసి దాదాపు 300 వరకూ భాజపా నాయకుల ఫోన్లను సిద్దరామయ్య ట్యాపింగ్‌ చేయించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జేడీఎస్‌ తిరుగుబాటు ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఏహెచ్‌ విశ్వనాథ్‌ ఈ ఆరోపణలను చేయడంతో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్‌ నేతలు సిద్దరామయ్య, మల్లిఖార్జున ఖర్గే, డీకే శివకుమార్‌, మాజీ హోంమంత్రి ఎంబీ పాటిల్‌ తదితరులు విచారణ ఎదుర్కొనే అవకాశముంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.