Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144085
            [news_title_telugu_html] => 

అందుకే ట్రిపుల్‌ తలాక్‌కు కాంగ్రెస్‌ మద్దతు: షా

[news_title_telugu] => అందుకే ట్రిపుల్‌ తలాక్‌కు కాంగ్రెస్‌ మద్దతు: షా [news_title_english] => congress has no shame favours triple talaq to keep its vote bank says amit shah [news_short_description] => ముమ్మారు తలాక్‌ చెప్పడాన్ని నేరంగా పరిగణించే చట్టం విషయంలో కాంగ్రెస్‌ వ్యవహరిస్తున్న తీరుపై హోంమంత్రి, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా [news_tags_keywords] => amit shah,triple talaq,bjp,congress,politics [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 00:22:20 [news_isactive] => 1 [news_status] => 2 ) )
అందుకే ట్రిపుల్‌ తలాక్‌కు కాంగ్రెస్‌ మద్దతు: షా - congress has no shame favours triple talaq to keep its vote bank says amit shah - EENADU
close

తాజా వార్తలు

అందుకే ట్రిపుల్‌ తలాక్‌కు కాంగ్రెస్‌ మద్దతు: షా

దిల్లీ: ముమ్మారు తలాక్‌ చెప్పడాన్ని నేరంగా పరిగణించే చట్టం విషయంలో కాంగ్రెస్‌ వ్యవహరిస్తున్న తీరుపై హోంమంత్రి, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా విమర్శలు గుప్పించారు. ఓటు బ్యాంకు కాపాడుకోవడం కోసమే ట్రిపుల్‌ తలాక్‌కు ఆ పార్టీ మద్దతు తెలుపుతోందన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ పై ఇక్కడ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

‘‘కాంగ్రెస్‌ పార్టీకి సిగ్గులేదు. ట్రిపుల్‌ తలాక్‌కు మద్దతిస్తున్నట్లు వారే చెప్పుకుంటున్నారు. ఈ విషయంలో తమ వైఖరిని ఎలా సమర్థించుకోవాలో తెలీక.. ఓటు బ్యాంకు కాపాడుకోవడం కోసం ఆందోళన చేస్తున్నారు’’ అని అమిత్‌ షా అన్నారు. ఇలాంటి ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే ఇన్నాళ్ల పాటు ఈ దురాచారం కొనసాగుతోందన్నారు. 1985లోనే షాబానో కేసులో సుప్రీం కోర్టు ట్రిపుల్‌ తలాక్‌కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినా.. రాజీవ్‌ గాంధీ అప్పట్లో ముస్లింలకు తలొగ్గి దాన్ని పట్టించుకోలేదన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ ఓ దురాచారం అని తెలిసినా కొన్ని పార్టీలు దాన్ని పార్లమెంటులో వ్యతిరేకించాయని అమిత్‌షా అన్నారు. కానీ వారి మనసుకు మాత్రం అది వాస్తవం అని తెలసని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ సర్వే ప్రకారం 92.1 శాతం మంది మహిళలు దీని రద్దు కోరుకున్నారని చెప్పారు. ఇస్లామిక్‌ దేశాలు సైతం దీన్ని నిషేధించాయని గుర్తుచేశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.