Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144555
            [news_title_telugu_html] => 

‘చంద్రబాబు ఇంటిని ముంచాలనే ఆలోచన లేదు’

[news_title_telugu] => ‘చంద్రబాబు ఇంటిని ముంచాలనే ఆలోచన లేదు’ [news_title_english] => Minister Anil Yadav Pressmeet on Krishna Flood [news_short_description] => 2009 తర్వాత రాష్ట్రంలో ఇంత భారీ స్థాయిలో ఎప్పుడూ వరదలు రాలేదని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ చెప్పారు. సరైన ... [news_tags_keywords] => Anil Yadav,Flood,Ap News  [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 16:06:45 [news_isactive] => 1 [news_status] => 2 ) )
‘చంద్రబాబు ఇంటిని ముంచాలనే ఆలోచన లేదు’ - Minister Anil Yadav Pressmeet on Krishna Flood - EENADU
close

తాజా వార్తలు

‘చంద్రబాబు ఇంటిని ముంచాలనే ఆలోచన లేదు’

అమరావతి: 2009 తర్వాత రాష్ట్రంలో ఇంత భారీ స్థాయిలో ఎప్పుడూ వరదలు రాలేదని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ చెప్పారు. గరిష్ఠంగా 8.05లక్షల క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజ్‌ నుంచి వదిలినట్లు చెప్పారు. ఎక్కడికక్కడ సమన్వయం చేసుకుంటూ సరైన సమయంలోనే వరదనీటిని దిగువకు వదిలామన్నారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. తెదేపా అధినేత చంద్రబాబు ఉంటున్న ఇంటిని ముంచాలనే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. వరదపై తెదేపా నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాయలసీమకు నీరివ్వడంలో ఎలాంటి నిర్లక్ష్యం లేదని చెప్పారు.

అధికారులతో సమీక్షలు చేయడం ఒక్కటే తమ బాధ్యత కాదని.. క్షేత్రస్థాయిలో ప్రజల బాగోగులనూ పట్టించుకోవాల్సి ఉంటుందని అనిల్‌ వ్యాఖ్యానించారు. తెదేపా నేతలు లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. భారీగా వరదనీరు వచ్చినపుడు కొన్ని ఇళ్లు, పొలాలు మునగడం సహజమన్నారు. అధికారులు వారిపని వారు చేశారని.. తాము జోక్యం చేసుకోలేదని చెప్పారు. ప్రాజెక్టుల నుంచి నీటిని వదిలినపుడు అధికారులు కొన్ని లెక్కలు పాటిస్తారన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అన్ని సహాయ కార్యక్రమాలు చేపట్టామని మంత్రి వివరించారు.  


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.