Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145116
            [news_title_telugu_html] => 

అతనో పొలిటికల్‌ స్టార్టప్‌.. 

[news_title_telugu] => అతనో పొలిటికల్‌ స్టార్టప్‌..  [news_title_english] => Arvind Kejriwal is political start-up [news_short_description] => దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను రాజకీయ అంకుర సంస్థతో పోలుస్తూ విమర్శలు చేశారు కేంద్ర మంత్రి హర్‌దీప్‌ పూరి. [news_tags_keywords] => Delhi CM, Hardeep Puri ,Arvind Kejriwal [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 00:11:43 [news_isactive] => 1 [news_status] => 2 ) )
అతనో పొలిటికల్‌ స్టార్టప్‌..  - Arvind Kejriwal is political start-up - EENADU
close

తాజా వార్తలు

అతనో పొలిటికల్‌ స్టార్టప్‌.. 

కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించిన కేంద్రమంత్రి

దిల్లీ: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను రాజకీయ అంకుర సంస్థతో పోలుస్తూ విమర్శలు చేశారు కేంద్ర మంత్రి హర్‌దీప్‌ పూరి. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..ప్రజాకర్షక పథకాలతో దిల్లీని ప్రపంచ స్థాయి కేంద్రంగా మార్చలేమన్నారు. విభిన్నంగా వ్యవహరించకపోతే కేజ్రీవాల్ ఈ రంగంలో ఎక్కువ కాలం కొనసాగలేరని అభిప్రాయపడ్డారు. 

‘రాజకీయంగా మేం వేర్వేరు పార్టీలకు చెందిన వాళ్లం. ఆయన ఒక రాజకీయ అంకుర సంస్థ, ప్రజాకర్షక నాయకుడు. ప్రజలను ఆకట్టుకొనే పథకాలను ప్రవేశపెడతారు. కానీ నేను వ్యవస్థకు చెందిన వ్యక్తిని’ అని వెల్లడించారు. ‘దిల్లీ సంపన్న నగరమైతే ప్రజలకు ఇలాంటి సబ్సిడీలు ఇవ్వడం సరైనదే. కానీ దిల్లీ అభివృద్ధి కోసం రుణాలు తెచ్చి, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈ సమయంలో ఆలోచించి నిధులు వినియోగించాల్సిన అవసరం ఉంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్టోబరు 2 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు కట్టకుండా దిల్లీ వాసులకు వెసులుబాటు కల్పించడం వంటి ప్రజాకర్షక పథకాలను కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్కడ కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన ప్రజాకర్షక పథకాలను ప్రకటిస్తున్నారని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.  
 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.