Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145509
            [news_title_telugu_html] => 

కోడెల బాగోతాలు త్వరలోనే వెలుగులోకి

[news_title_telugu] => కోడెల బాగోతాలు త్వరలోనే వెలుగులోకి [news_title_english] => kannababu fires on kodela [news_short_description] => హైదరాబాద్‌లో పాత అసెంబ్లీకి చెందిన 4 లారీల ఫర్నిచరును పట్టుకుపోయిన మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు.. ... [news_tags_keywords] => kannababu,ap politics [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 08:10:59 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కోడెల బాగోతాలు త్వరలోనే వెలుగులోకి - kannababu fires on kodela - EENADU
close

తాజా వార్తలు

కోడెల బాగోతాలు త్వరలోనే వెలుగులోకి

మంత్రి కన్నబాబు వ్యాఖ్య

అమరావతి: హైదరాబాద్‌లో పాత అసెంబ్లీకి చెందిన 4 లారీల ఫర్నిచరును పట్టుకుపోయిన మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు.. దొరికిపోయాక వెనక్కి ఇస్తానంటున్నారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. సాధారణ వ్యక్తి ఇలా చేస్తే దొంగతనమో, దోపిడీయో అంటారని విమర్శించారు. ఆయన చేసింది తప్పో కాదో తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. సచివాలయంలో మంగళవారం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఎందుకు ఓడామో తెలియడం లేదనే చంద్రబాబు ఇలాంటివన్నీ తెలుసుకోవాలని సూచించారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రస్తుత సభాపతి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

అది ప్రజల ఆస్తి
ప్రజల ఆస్తి అయిన అసెంబ్లీలోని ఫర్నిచరును కోడెల తన ఇంటికి ఎలా తీసుకెళతారని వైకాపా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. ఆయన బాగోతాలు త్వరలోనే బయటపడతాయని వ్యాఖ్యానించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.