Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145639
            [news_title_telugu_html] => 

సార్‌ .. మీరు ఇటు వచ్చి విపక్షాలను నడిపించాలి..

[news_title_telugu] => సార్‌ .. మీరు ఇటు వచ్చి విపక్షాలను నడిపించాలి.. [news_title_english] => Nitish Kumar to Lead Opposition Camp [news_short_description] => కొద్ది నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ చేతిలో విపక్షాలు దారుణ పరాభావాన్ని ఎదుర్కొన్నాయి. [news_tags_keywords] => jdu, Nitish Kumar,nda [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 19:52:30 [news_isactive] => 1 [news_status] => 2 ) )
సార్‌ .. మీరు ఇటు వచ్చి విపక్షాలను నడిపించాలి.. - Nitish Kumar to Lead Opposition Camp - EENADU
close

తాజా వార్తలు

సార్‌ .. మీరు ఇటు వచ్చి విపక్షాలను నడిపించాలి..

పట్నా: కొద్ది నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ చేతిలో విపక్షాలు దారుణ పరాభావాన్ని ఎదుర్కొన్నాయి. ఆ దెబ్బకు విపక్ష పార్టీలకు పెద్దన్నగా వ్యవహరించిన కాంగ్రెస్‌కు నాయకత్వ లేమి ఏర్పడింది. బిహార్‌లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా ఓటమి అనంతరం ఎవరికి అందుబాటులో లేకుండా పోయారు. దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జైలు జీవితం గడుపుతున్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి, టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ వంటి నేతలు మొదట నాయకత్వ ఆలోచనలు చేసినా, ఇప్పుడు సొంత పార్టీ బలోపేతం మీదే దృష్టి పెడుతున్నారు. దాంతో విపక్షాల ఐక్యత గందరగోళంలో పడిపోయింది. దాంతో ఇప్పుడు సోషలిస్టు భావజాలం ఉన్న పార్టీలన్నింటికి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఒక్కరే పెద్ద దిక్కుగా కనిపిస్తున్నారు. ఆయనకున్న సెక్యులర్ ఇమేజ్‌, రాజకీయ అనుభవం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఉపయోగపడుతుందని కొందరు నాయకులు భావిస్తున్నారు. కానీ నితీశ్ పార్టీ జేడీయూ ప్రస్తుతం ఎన్డీఏ భాగస్వామి కావడం విశేషం.

బిహార్‌లో జేడీయూ ప్రత్యర్థి ఆర్జేడీ సీనియర్ నేత శివానంద్‌ తివారీ, ఇంకా ఇతర నేతలు నితీశ్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ‘ప్రతిపక్షాల్లో నాయకత్వ లేమి ఉంది. నితీశ్‌ను నేను 35 సంవత్సరాలుగా గమనిస్తున్నాను. ఈ దేశ ప్రధాని అయ్యే అన్ని రాజకీయ అర్హతలు, సామర్థ్యం ఆయనకున్నాయి. ఆయన వెంటనే ఎన్డీఏను వీడి, జాతీయ స్థాయిలో విపక్షాలను నడిపించాలి. ఇప్పటికీ ఎన్డీఏలో కొనసాగుతూ చరిత్రాత్మక తప్పిదం చేస్తున్నారు’ అని తివారీ వ్యాఖ్యానించారు. అలాగే ది హిందుస్థానీ ఆవామ్‌ మోర్చా(హెచ్‌ఏఎం) అధినేత జీతన్‌ రాం మాంఝి మాట్లాడుతూ..‘ఒకే భావజాలం ఉన్న నాయకులంతా కలిసిరావాల్సిన సమయం ఇది. నితీశ్ ఎన్డీఏను వీడాలి’ అని సూచించారు. 

2020 అసెంబ్లీ ఎన్నికల ముందు జేడీయూ అధినేతకు ఆర్జేడీ పార్టీ ఇస్తున్న బహిరంగ ఆహ్వానంగా ఇది కనిసిస్తుంది. 2015లో కూడా ఈ రెండు పార్టీలు కలిసే అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి విజయం సాధించాయి. సార్వత్రిక ఎన్నికల ఓటమి తరవాత తేజస్వీ ఆర్జేడీ పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించడానికి సుముఖుత చూపడం లేదు. తన సోదరి మీసా భారతి, సోదరుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటేనే తాను పార్టీకి నాయకత్వం వహిస్తానని లాలూకు వెల్లడించినట్లు సమాచారం. అంతేకాకుండా ఆయన కుటుంబం వివిధ కేసుల్లో ఎదుర్కొంటున్న ఆరోపణల నుంచి బయటపడి, కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభించాలని కోరుకుంటున్నట్లు తెలుస్తుంది. మరోవైపు, ఆ పార్టీ నాయకులు లాలూ తనయుల నాయకత్వంలో పనిచేయడానికి విముఖతతో ఉండగా, మరికొందరేమో పార్టీని నడిపించడం కోసం వర్కింగ్ ప్రెసిడెంట్‌ను నియమించి, బాధ్యతలు అప్పగించాలని కోరుకుంటున్నారు. ఈ పరిణామాలతో కొద్ది నెలల్లో వివిధ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ముందుకు వెళ్లేందుకు నితీశ్ కుమార్ ముందు ఒక వేదిక ఏర్పడినట్లు కనిపిస్తుంది. 

ఇదిలా ఉండగా, ఎన్డీఏ భాగస్వామి అయినప్పటికీ నితీశ్ ఆ కూటమి విధానాలను కొన్నింటిని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. తాజాగా త్రిపుల్ తలాక్‌ బిల్లు, ఆర్టికల్ 370 రద్దు బిల్లుల్ని రెండు సభల్లో జేడీయూ వ్యతిరేకించింది. అలాగే రామ మందిర నిర్మాణం, యూనిఫామ్ సివిల్ కోడ్ వంటివాటికి ఆ పార్టీ వ్యతిరేకంగానే ఉంది. ఆ రెండు అంశాలను కోర్టు తీర్పులు,  ఏకాభిప్రాయం ద్వారా పరిష్కరించాలని కోరుకుంటోంది. అలాగే కేంద్రం, బిహార్‌లో ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నప్పటికీ దిల్లీ, హరియాణా, ఝార్ఖండ్, జమ్ముకశ్మీర్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడాలని భావిస్తుంది. దాని ద్వారా 2020లో జాతీయ పార్టీ హోదా పొందడానికి కావాల్సిన అర్హత పొందేలా ప్రణాళికలు రచిస్తోంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.