Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145677
            [news_title_telugu_html] => రాజధానిపై సీఎం స్పష్టత ఇవ్వాలి:రామకృష్ణ
            [news_title_telugu] => రాజధానిపై సీఎం స్పష్టత ఇవ్వాలి:రామకృష్ణ
            [news_title_english] => AP Cpi state secretary Ramakrishna comments on ap capital Amaravati
            [news_short_description] => రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. సీఎం జగన్‌ రాష్ట్రంలో...

            [news_tags_keywords] => Rama krishna,CPI,Amaravati,Ap politics
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-21 21:08:20
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
రాజధానిపై సీఎం స్పష్టత ఇవ్వాలి:రామకృష్ణ - AP Cpi state secretary Ramakrishna comments on ap capital Amaravati - EENADU
close

తాజా వార్తలు

రాజధానిపై సీఎం స్పష్టత ఇవ్వాలి:రామకృష్ణ

అమరావతి: రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. సీఎం జగన్‌ రాష్ట్రంలో లేని సమయంలో రాజధానిపై మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. మంత్రి చేసిన అసంబద్ధ వ్యాఖ్యలు ప్రజల్లో అనేక అనుమానాలకు దారితీశాయని రామకృష్ణ విమర్శించారు. వరదల వలన అమరావతి ఎక్కడా మునగలేదని.. భవిష్యత్‌లో అమరావతి అభివృద్ధి చెందేందుకు బ్రహ్మాండమైన అవకాశాలున్నాయన్నారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈవిషయంలో ప్రజల్లో రేకెత్తిన అనుమానాల దృష్ట్యా సీఎం జగన్‌ రాష్ట్రానికి రాగానే రాజధాని తరలింపుపై స్పష్టమైన ప్రకటన చేయాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. 

ఇసుక కష్టాలు తొలగించండి
రాష్ట్రంలో ఇసుక కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రామకృష్ణ కోరారు. ఈ మేరకు సచివాలయంలో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.