Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145660
            [news_title_telugu_html] => 

రాజధానిపై జగన్‌ వైఖరి వెల్లడించాలి:దేవినేని

[news_title_telugu] => రాజధానిపై జగన్‌ వైఖరి వెల్లడించాలి:దేవినేని [news_title_english] => TDP Leader Devinei Uma Comments on AP Capital Issue [news_short_description] => రాజధాని అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించాలని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్‌ చేశారు. [news_tags_keywords] => Devineni,TDP,Amaravati,AP Politics [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 00:29:47 [news_isactive] => 1 [news_status] => 2 ) )
రాజధానిపై జగన్‌ వైఖరి వెల్లడించాలి:దేవినేని - TDP Leader Devinei Uma Comments on AP Capital Issue - EENADU
close

తాజా వార్తలు

రాజధానిపై జగన్‌ వైఖరి వెల్లడించాలి:దేవినేని

విజయవాడ: రాజధాని అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించాలని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై విదేశీ పర్యటనలో ఉన్న సీఎం జగన్‌ ట్విటర్‌ ద్వారా అయినా స్పందించాలని కోరారు. విజయవాడలోని తెదేపా కార్యాలయంలో ఉమా మీడియాతో మాట్లాడారు. రాజధాని రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారం కాదని చెప్పారు. ఇప్పటికే నాలుగు జిల్లాల నుంచి తమ ప్రాంతానికి రాజధాని తరలి రాబోతోందనే ప్రకటనలు వస్తున్నాయన్నారు. 33వేల మంది రైతుల త్యాగాన్ని.. రాజధాని శంకుస్థాపన ఎవరి చేతుల మీదుగా జరిగిందనే అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. 

రాజధాని మార్పు అంశంపై పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్న తర్వాత ఎంపీ విజయసాయిరెడ్డి మాటలకు విలువ ఎక్కడిదని ఉమా ప్రశ్నించారు. ఇడుపులపాయకు రాజధానిని తీసుకెళ్లాలన్నది సీఎం కుట్రలో భాగమని ఆయన ఆక్షేపించారు. ప్రధానికి రాజధాని విషయంలో రాసిన లేఖను బయటపెట్టి పారదర్శక పాలన గురించి మాట్లాడాలని ఉమా డిమాండ్‌ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలో చేపట్టిన అనేక అభివృద్ధి పనులను ఆ తర్వాతి ప్రభుత్వాలు కొనసాగించాయని.. దాని వల్లే హైదరాబాద్ ప్రపంచ పటంలో నిలిచిందన్నారు. జగన్ సీఎం అయ్యాక చంద్రబాబు హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులన్నింటినీ నిలిపి వేస్తున్నారని దేవినేని ఉమా ఆరోపించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.