Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145687
            [news_title_telugu_html] => 

నేను ఎలాంటి నేరం చేయలేదు: చిదంబరం

[news_title_telugu] => నేను ఎలాంటి నేరం చేయలేదు: చిదంబరం [news_title_english] => Chidambaram Responds on INX Media Case [news_short_description] => తనపై సీబీఐ, ఈడీకి చెందిన ఎలాంటి కేసులూ లేవని కాంగ్రెస్‌ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అన్నారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసు విషయంలో జరుగుతున్న పరిణామాల... [news_tags_keywords] => Chidambaram,Congress,INX Media case [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => mJLRkJrKQ4o| [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 00:29:30 [news_isactive] => 1 [news_status] => 2 ) )
నేను ఎలాంటి నేరం చేయలేదు: చిదంబరం - Chidambaram Responds on INX Media Case - EENADU
close

తాజా వార్తలు

నేను ఎలాంటి నేరం చేయలేదు: చిదంబరం

దిల్లీ: తనపై సీబీఐ, ఈడీకి చెందిన ఎలాంటి కేసులూ లేవని కాంగ్రెస్‌ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అన్నారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసు.. తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో దిల్లీలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో ఊహించని విధంగా ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎలాంటి నేరం చేయలేదని.. సీబీఐ, ఈడీ నుంచి ఎలాంటి ఛార్జ్‌షీట్‌ తనపై లేదని చెప్పారు. ఈ అంశంలో తనతో పాటు కుమారుడిపైనా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ వ్యవహారమంతా రాజకీయ ప్రేరేపితమేనని.. కక్ష సాధింపు చర్యలు తప్ప మరొకటి కాదని ఆరోపించారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదైనంత మాత్రాన ఎవరూ నేరస్థుడు కాదని చిదంబరం వ్యాఖ్యానించారు. ఏడాదిన్నర పాటు మధ్యంతర బెయిల్‌పై ఉన్నానని ఆయన వివరించారు. గత 24 గంటల్లో చాలా జరిగిందన్నారు. ప్రజాస్వామ్యం స్వేచ్ఛగా ఉందని తాను నమ్ముతున్నానని చెప్పారు. చట్టాన్ని తాను గౌరవిస్తానని..సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని చిదంబరం స్పష్టం చేశారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.