Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146223
            [news_title_telugu_html] => 

ప్రతిసారి ఆయనను విలన్‌ను చేస్తే కుదరదు

[news_title_telugu] => ప్రతిసారి ఆయనను విలన్‌ను చేస్తే కుదరదు [news_title_english] => Demonising PM Modi all the time wont help [news_short_description] => ప్రధాని నరేంద్ర మోదీ అవలంబించే విధానాలు పూర్తిగా వ్యతిరేకించదగ్గవి కాదని కాంగ్రెస్‌ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు. [news_tags_keywords] => Jairam Ramesh, PM Modi ,Congress [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 23:45:58 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ప్రతిసారి ఆయనను విలన్‌ను చేస్తే కుదరదు - Demonising PM Modi all the time wont help - EENADU
close

తాజా వార్తలు

ప్రతిసారి ఆయనను విలన్‌ను చేస్తే కుదరదు

ప్రధాని మీద జైరాం రమేశ్ ప్రశంసలు

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అవలంబించే విధానాలు పూర్తిగా వ్యతిరేకించదగ్గవి కాదని కాంగ్రెస్‌ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు. ప్రతిసారి ఆయన్ను విలన్‌ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని విపక్షాలకు సూచించారు.  ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన అభివృద్ధి పనులను గుర్తించాల్సిన సమయం వచ్చిందని, వాటివల్లే ఆయన కూటమి భారీ మెజార్టీతో మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకుందని వెల్లడించారు. ‘మాలివొలెంట్ రిపబ్లిక్‌: ఏ షార్ట్ హిస్టరీ ఆఫ్‌ న్యూ ఇండియా’ అనే పుస్తక ప్రారంభ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘ప్రజలతో అల్లుకుపోయే భాషలోనే మోదీ మాట్లాడతారు. మనం ఆయన పనులను గుర్తించకపోయినా, ప్రజలు గుర్తిస్తున్నారు. గతంలో అలాంటి విధానాలను ఎవరు అమలు చేయలేదు. ఈ వ్యక్తిని మనం ఎదుర్కోలేం. ప్రతిసారి ఆయన్ను విలన్‌గా చిత్రీకరిస్తే, ఆయన్ను ఎదుర్కోవడం చాలా కష్టం’ అని విపక్షాలను హెచ్చరించారు. తన వ్యాఖ్యలపై స్పష్టత ఇస్తూ..ఇప్పుడు మోదీని ప్రశంసించాలని తాను ఎవరికి చెప్పడం లేదని, అయితే పరిపాలన పరంగా, ముఖ్యంగా ఆర్థిక  విధానాల్లో ఆయన తీసుకువచ్చిన మార్పులను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం మీద ప్రశంసలు కురిపించారు. అది మోదీని కోట్ల మంది మహిళల చెంతకు చేర్చిందని, 2014 కంటే గొప్ప ఆకర్షణను ఆయనకు తీసుకువచ్చిందన్నారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.