Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000051
            [news_title_telugu_html] => 

విశాఖలో తెదేపా, వైకాపా మధ్య తోపులాట

[news_title_telugu] => విశాఖలో తెదేపా, వైకాపా మధ్య తోపులాట [news_title_english] => Protocol Controversy in Visakhapatnam [news_short_description] => హుద్‌హుద్‌ తుపాను బాధితుల కోసం విశాఖ తూర్పు నియోజకవర్గంలోని ఎంవీపీ కాలనీ సెక్టార్‌ 7లో నిర్మించిన ఇళ్ల ప్రారంభోత్సవంలో ప్రొటోకాల్‌ వివాదం తలెత్తింది. ఇళ్ల ప్రారంభానికి [news_tags_keywords] => Protocol,Controversy,TDP,YSRCP [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-23 19:02:41 [news_isactive] => 1 [news_status] => 2 ) )
విశాఖలో తెదేపా, వైకాపా మధ్య తోపులాట - Protocol Controversy in Visakhapatnam - EENADU
close

తాజా వార్తలు

విశాఖలో తెదేపా, వైకాపా మధ్య తోపులాట

విశాఖ: హుద్‌హుద్‌ తుపాను బాధితుల కోసం విశాఖ తూర్పు నియోజకవర్గంలోని ఎంవీపీ కాలనీ సెక్టార్‌ 7లో నిర్మించిన ఇళ్ల ప్రారంభోత్సవంలో ప్రొటోకాల్‌ వివాదం తలెత్తింది. ఇళ్ల ప్రారంభానికి మంత్రి అవంతి శ్రీనివాస్‌, వీఎంఆర్డీఏ ఛైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాసరావుతో సహా వైకాపా నేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తెదేపాకు చెందిన స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు ఆహ్వానం లేకపోవడంపై ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో తెదేపా, వైకాపా వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. తెదేపా కార్యకర్తల ఆందోళన మధ్యే మంత్రి ప్రారంభోత్సవం చేశారు. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న తనకు ఆహ్వానం అందకపోవడంపై వెలగపూడి రామకృష్ణబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్‌ను ఉల్లంఘనపై అధికారుల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తోపులాట అంశంలో వైకాపా కార్యకర్తలపై కేసు నమోదు చేయాలని వెలగపూడి డిమాండ్‌ చేశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.