Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146631
            [news_title_telugu_html] => 

 పార్టీ బలోపేతానికి కొత్త ఎత్తు !

[news_title_telugu] =>  పార్టీ బలోపేతానికి కొత్త ఎత్తు ! [news_title_english] => New ActionPlan For Party [news_short_description] => పార్టీ అభివృద్ధికి ఎంఎన్‌ఎం ఇటీవల పలు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా తాజాగా ‘ఆపరేషన్‌ 500’ను తెరపైకి తీసుకొచ్చింది... [news_tags_keywords] => KamalHasan,Tamilanadu,Politics [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-23 08:52:04 [news_isactive] => 1 [news_status] => 2 ) )
 పార్టీ బలోపేతానికి కొత్త ఎత్తు ! - New ActionPlan For Party - EENADU
close

తాజా వార్తలు

 పార్టీ బలోపేతానికి కొత్త ఎత్తు !

పార్టీ కోసం కమల్‌ వ్యూహం

పార్టీ అభివృద్ధికి ఎంఎన్‌ఎం ఇటీవల పలు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా తాజాగా ‘ఆపరేషన్‌ 500’ను తెరపైకి తీసుకొచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లోని ఓట్ల శాతం విశ్లేషణ ఆధారంగా ఈ సరికొత్త వ్యూహానికి తెరలేపింది. దీన్ని అమలు చేసేందుకు ఇప్పటికే నిర్వాహకులు రంగంలోకి దిగారు. 2021 శాసనసభ ఎన్నికల దృష్ట్యా పార్టీ అధిష్ఠానం చురుగ్గా వ్యవహరిస్తుండడంతో నిర్వాహకులు, కార్యకర్తలు జోష్‌తో ఉన్నారు.

చెన్నై: నటుడు కమల్‌హాసన్‌ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి మక్కళ్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీని ప్రారంభించారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో గెలుపుపై ఎలాంటి ఆశలు లేకుండా ఓటు బ్యాంకు తెలుసుకోవడం కోసమే ఆయన పార్టీ పోటీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తమ పార్టీ ఓటు బ్యాంకు వివరాలను విశ్లేషించి ఆ మేరకు రాష్ట్రంలో తర్వాతి ఎన్నికలకు వ్యూహ రచన చేస్తున్నారు. దీనికి ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌కు చెందిన ఐ-ప్యాక్‌ బృందం ఇప్పటికే రంగంలోకి దిగి అధ్యయనం చేస్తోంది. దీని ఆధారంగా గతంలో కమల్‌హాసన్‌కు పలు సూచనలు అందాయి. ఈ నేపథ్యంలో తాజాగా ‘ఆపరేషన్‌ 500’ను కమల్‌ తెరపైకి తీసుకొచ్చారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం లేకుండా తిరుగులేని బలమైన పార్టీలుగా దూసుకెళ్తున్న అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేలకు గట్టి పోటీ ఇచ్చేలా ఎంఎన్‌ఎంను తీర్చిదిద్దడమే ఈ వ్యూహం లక్ష్యం. ఆ మేరకు 2021 శాసనసభ ఎన్నికల్లోపు డీఎంకే, అన్నాడీఎంకే వేగానికి గట్టి పోటీ ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాల్లో ఎంఎన్‌ఎం 12 నుంచి 25 శాతం వరకు ఓట్లను రాబట్టగా... గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఓట్ల శాతం దారుణంగా ఉంది. కొన్ని గ్రామాల్లో ఎంఎన్‌ఎంను ఓట్ల శాతం కంగు తినిపించింది. దీంతో తర్వాతి ఎన్నికల నాటికి గ్రామీణ ప్రాంతాల్లోనూ తమ పార్టీకి ఓటర్ల మద్దతు కూడగట్టుకోవాలని అధిష్ఠానం నిర్ణయించింది. దీని కోసమే ప్రశాంత్‌ కిశోర్‌ బృందం ‘ఆపరేషన్‌ 500’ వ్యూహాన్ని రచించి కమల్‌కు అందజేసిందని సమాచారం. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు అవసరమైన అన్ని పనులను 500 రోజుల్లోపు పూర్తి చేసి, తర్వాతి శాసనసభ ఎన్నికలకు సిద్ధం కావడమే దీని లక్ష్యం.

పార్టీ నిర్మాణంలో మార్పులు

ఎంఎన్‌ఎం పార్టీలో కిందిస్థాయి నిర్వాహకులు పనిచేయకపోవడం వల్లే లోక్‌సభ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల ఓట్లు ఆ పార్టీకి దక్కలేదని ఐ-ప్యాక్‌ బృందం తేల్చింది. తర్వాతి ఎన్నికల్లోపు పార్టీని బలోపేతం చేసేందుకు ‘ఆపరేషన్‌ 500’ వ్యూహాన్ని సూచించింది. పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపింది. దీంతో పార్టీ నిర్మాణంలో కమల్‌హాసన్‌ మార్పులు చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఓటరును నేరుగా వెళ్లి కలిసేందుకు వీలుగా కొత్త బాధ్యులను కొద్దిరోజుల క్రితం ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు తొలి విడతగా ఆరుగురు ప్రధాన కార్యదర్శులను నియమించారు. అలాగే పార్టీ జిల్లాలను ఎనిమిది జోన్లుగా విభజించారు. ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాల్లో ఏ పార్టీ చేయని విధంగా ఎన్నికల కోసం ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో ఓ ప్రధాన కార్యదర్శిని నియమించారు. త్వరలో జిల్లాల వారీగా ఎన్నికల కార్యదర్శులనూ నియమించనున్నారు. రానున్న ఎన్నికల్లోపు పార్టీని బలోపేతం చేయడం, బూత్‌ కమిటీల ఏర్పాటు, ఆయా ప్రాంతాల్లోని ప్రధాన సమస్యలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లడం వీరి కర్తవ్యం. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక వ్యవస్థగా వీరు వ్యవహరించనున్నారు. ప్రధాన కార్యదర్శులు మీడియా, ఐటీ, బహిరంగ కార్యక్రమాలను సమన్వయం చేయనున్నారు. జిల్లాల వారీగా ఐటీ, మీడియా సమన్వయకర్తల పదవులు ప్రకటించనున్నారు. జిల్లాకొక అధ్యక్షుడు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, ఆరుగురు సంయుక్త కార్యదర్శులు, ఆరుగురు ఉప కార్యదర్శులు, పది మంది కమిటీ సభ్యులను నియమించనున్నారు. పార్టీలోని అత్యధికులు పదవుల్లో ఉండాలన్నదే ఈ కొత్త పదవులకు కారణమని, ప్రజల వద్దకు పార్టీని చేర్చడమే ఈ పదవుల్లోని నిర్వాహకుల బాధ్యత అని సమాచారం. ఇలా ఒక్కో జిల్లాకు పలు కీలక పదవులు సృష్టించడం ద్వారా ఏ ఒక్కరి చేతిలోనో పార్టీ ఉందనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లదని, అలాగే ఏదైనా విషయంపై పలువురి అభిప్రాయాలకు ప్రాధాన్యం లభిస్తుందని అధిష్ఠానం భావిస్తోంది. ప్రస్తుతం జిల్లావారీగా అధ్యయన పనులు ప్రారంభించింది. జోన్లవారీగా సమాలోచనలు నిర్వహిస్తోంది. అలాగే ఐ-ప్యాక్‌ బృందం సభ్యులు కూడా జిల్లాల్లో ఇంకా అధ్యయనం కొనసాగిస్తున్నారని సమాచారం.

మహిళలను ఆకట్టుకునేలా...

ఎంఎన్‌ఎం బలోపేతానికి పలు ప్రయత్నాలు చేపట్టిన కమల్‌హాసన్‌ పార్టీలోకి మహిళలను ఆకర్షించడానికి సినీ రంగానికి చెందిన సహ నటులు శ్రీప్రియ, కోవై సరళలకు పదవులు ఇచ్చారు. చురుకైన మరో మహిళకు పార్టీ పదవి ఇవ్వాలని నిర్ణయించి ఆ మేరకు అరుప్పుకోట్టైకు చెందిన మహిళా పారిశ్రామికవేత్త ఉమాదేవిని ప్రధానకార్యదర్శిగా ఇటీవల ప్రకటించారు. దీని గురించి ఆమె మాట్లాడుతూ... తన పరిశ్రమలో పలువురు మహిళలు పని చేస్తున్నారని, అందువల్ల వారి పరిస్థితి గురించి తనకు బాగా తెలుసని పేర్కొన్నారు. దాని గురించి అధిష్ఠానంతో పలు అభిప్రాయాలు పంచుకున్నానని, దాని దృష్ట్యా తనకు ఈ పదవి ఇచ్చి ఉండొచ్చని భావిస్తున్నానని తెలిపారు. అలాగే విశ్రాంత ఐపీఎస్‌ అధికారి మౌర్య, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి బషీర్‌ అహ్మద్‌ తదితరులు కూడా పదవుల్లో నియమితులైన విషయం తెలిసిందే. కమల్‌కు సన్నిహితుడైన డాక్టర్‌ మహేంద్రన్‌ ఉపాధ్యక్షుడి పదవిలోనే కొనసాగనున్నారు. పార్టీలో మార్పుల గురించి త్వరలో మరికొన్ని ప్రకటనలు వెలువడే అవకాశాలు ఉన్నాయని సమాచారం.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.