
తాజా వార్తలు
జూనియర్ల చెంప మీద కొట్టి..దుస్తులు విప్పించి ర్యాగింగ్
భువనేశ్వర్: విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ర్యాగింగ్ భూతాన్ని తరిమికొట్టడానికి దశాబ్ద కాలం క్రితమే కఠిన చట్టాలు ప్రవేశపెట్టినప్పటికీ ర్యాగింగ్ ఘటనలు ఆగడం లేదు. రెండు రోజుల క్రితం ఉత్తర్ ప్రదేశ్‌లో 150 మంది వైద్యవిద్యార్థులు ర్యాగింగ్ బారిన పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇలాంటి తరహా ఘటనే ఒడిశాలోనూ జరిగింది. మొదటి, రెండో సంవత్సర విద్యార్థులకు వెల్కమ్ పార్టీ ఏర్పాటు చేసి సీనియర్లు ఓవరాక్షన్ చేశారు. ఒడిశాలోని వీర్ సురేంద్ర సాయి టెక్నాలజీ యూనివర్సిటీ(వీఎస్‌ఎస్‌యూటీ)లో ఈ దారుణం చోటు చేసుకుంది. గత కొన్నేళ్లుగా వివాదాలకు అడ్డాగా నిలుస్తున్న ఈ యూనివర్సిటీలో తాజాగా జరిగిన ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
విశ్వవిద్యాలయంలో కొత్తగా చేరిన విద్యార్థులకు, రెండో సంవత్సరం విద్యార్థులకు ర్యాగింగ్ రుచి చూపించారు. వెల్కమ్ పార్టీ పేరుతో సీనియర్లు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జూనియర్ల చెంపలు వాయించారు. అనంతరం వారి దుస్తులు విప్పించి అర్ధనగ్నంగా స్టేజి మీద డ్యాన్సులు వేయించారు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ విషయం కాస్తా ఆ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక విద్యా శాఖ మంత్రి దృష్టికి వెళ్లడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై తక్షణం విచారణ జరిపించాలని ఆదేశించారు. ర్యాగింగ్‌కు పాల్పడిన 52 మందిని కళాశాల నుంచి సస్పెండ్ చేశారు. వారికి రూ.2,000 జరిమానా కూడా విధించారు. ఈ విశ్వవిద్యాలయంలో ఇలాంటి తరహ ఘటనలు జరగడం కొత్తేం కాదు. కొంతకాలం కిందట కూడా ఇలాంటి ఘటనే జరగడంతో 15మందికి భారీగా జరిమానాలు విధించి ఏడాది పాటు కాలేజి నుంచి సస్పెండ్ చేశారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఉతికి ఆరేశారు
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- దిశకు తల్లిదండ్రులతో సఖ్యత లేదేమో!
- గొల్లపూడి మారుతీరావు కన్నుమూత
- అసలు కాల్పులు అక్కడే జరిగాయా?
- పథకం ప్రకారమే బూటకపు ఎన్కౌంటర్
- వాంఖడేలో రికార్డుల మోత!
- రఘురామ కృష్ణరాజు విందుకు రాజ్‌నాథ్‌సింగ్
- ఎన్‌కౌంటర్‌పై సుప్రీం విచారణ కమిషన్
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
