Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000477
            [news_title_telugu_html] => 

‘అలా చేయమని మోదీకి భాజపా నేతలు సూచించారా?’

[news_title_telugu] => ‘అలా చేయమని మోదీకి భాజపా నేతలు సూచించారా?’ [news_title_english] => Kapil Sibal Wants to Know if BJP Has Ever said not to demonise opponent [news_short_description] => ప్రధాని మోదీపై వ్యక్తిగత విమర్శలు తగవని, విధానాలపై మాత్రమే వ్యాఖ్యానించాలని కాంగ్రెస్‌ పార్టీలోని పలువురు నేతలు వ్యాఖ్యానించడాన్ని ఆ పార్టీ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ సమర్థించారు. భాజపా నేతలు అలా చేయగలరా అని ప్రశ్నించారు.............. [news_tags_keywords] => kapil Sibal,Congress,Modi,BJP [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-24 16:06:46 [news_isactive] => 1 [news_status] => 2 ) )
‘అలా చేయమని మోదీకి భాజపా నేతలు సూచించారా?’ - Kapil Sibal Wants to Know if BJP Has Ever said not to demonise opponent - EENADU
close

తాజా వార్తలు

‘అలా చేయమని మోదీకి భాజపా నేతలు సూచించారా?’

దిల్లీ: ప్రధాని మోదీపై వ్యక్తిగత విమర్శలు తగవని, విధానాలపై మాత్రమే వ్యాఖ్యానించాలని కాంగ్రెస్‌ పార్టీలోని పలువురు నేతలు వ్యాఖ్యానించడాన్ని ఆ పార్టీ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ సమర్థించారు. భాజపా నేతలు అలా చేయగలరా అని ప్రశ్నించారు. ప్రతిసారీ ప్రతిపక్షాన్ని విలన్‌గా చూపడం ఆపాలని మోదీకి ఎప్పుడైనా సూచించారా అని అడిగారు. పార్టీలకతీతంగా మంచి పనులను మెచ్చుకునే సాంప్రదాయం కేవలం కాంగ్రెస్‌ వారికి మాత్రమే ఉందని పరోక్షంగా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ‘‘ప్రతిపక్షాన్ని విలన్‌గా చిత్రీకరించొద్దని ఏ భాజపా నాయకుడైనా ప్రధాని మోదీకి ఎప్పుడైనా సూచించారా’’ అని సిబల్‌ ట్వీట్‌ చేశారు. 

ప్రధాని నరేంద్ర మోదీపై వ్యక్తిగత విమర్శలు చేయకూడదని, విధానాలపైనే వ్యాఖ్యానించాలని కాంగ్రెస్‌ పార్టీలోని పలువురు నాయకులు అభిప్రాయపడ్డ విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్‌, లోక్‌సభ సభ్యుడు శశి థరూర్‌, అధికార ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వి మోదీపై సానుకూల వ్యాఖ్యలు చేసిన వారిలో ఉన్నారు. గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో జైరాం రమేశ్‌ మాట్లాడుతూ మోదీని రాక్షసుడిగా భావించకూడదని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ వ్యతిరేక దృష్టితో చూడకూడదని చెప్పారు. ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తూ సింఘ్వి శుక్రవారం ట్వీట్‌ చేశారు. వ్యక్తుల వారీగా కాకుండా సమస్యల ఆధారంగా పరిపాలన తీరును నిర్ణయించాలన్నారు. థరూర్‌ ట్వీట్‌ చేస్తూ మంచి పనులను ప్రశంసించి, తప్పులను విమర్శించాలని తాను గత ఆరేళ్లుగా చెబుతూ ఉన్నానని చెప్పుకొచ్చారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.