Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000530
            [news_title_telugu_html] => 

తెరపై మంత్రి.. విజయాల వెనుక వ్యూహకర్త!

[news_title_telugu] => తెరపై మంత్రి.. విజయాల వెనుక వ్యూహకర్త! [news_title_english] => jaitly one of the most important strategists for the BJP [news_short_description] => అది 2014. అవినీతి, కుంభకోణాలతో యూపీఏ కూటమి ప్రతిష్ఠ మసక బారింది. భారతీయ జనతా పార్టీ మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది... [news_tags_keywords] => arun jaitly,arun jaitley demise,bjp [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-24 13:38:18 [news_isactive] => 1 [news_status] => 2 ) )
తెరపై మంత్రి.. విజయాల వెనుక వ్యూహకర్త! - jaitly one of the most important strategists for the BJP - EENADU
close

తాజా వార్తలు

తెరపై మంత్రి.. విజయాల వెనుక వ్యూహకర్త!

అది 2014. అవినీతి, కుంభకోణాలతో యూపీఏ కూటమి ప్రతిష్ఠ మసకబారింది. భారతీయ జనతా పార్టీ మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. కానీ ఆ పార్టీ పెద్దల్లో కొందరికి అది ఇష్టం లేదు. కానీ మోదీనే అభ్యర్థిగా నిర్ణయించారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే సాహసోపేతమైన నిర్ణయాలకు మారుపేరుగా నిలిచింది ఎన్డీయే. రాత్రికి రాత్రి నోట్ల రద్దు చేసింది. జీఎస్టీని విజయవంతంగా పట్టాలెక్కించింది. అదే సమయంలో ఆయా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించింది.  వీటి వెనుక మోదీ-అమిత్‌షా ద్వయమే కనిపించినా.. ఆ కనిపించని మరో వ్యక్తే జైట్లీ. పైకి కేవలం కేంద్రమంత్రిగానే కనిపించినా భాజపా విజయంలో ఆయనదీ ‘కీ’లకపాత్ర అనడంలో సందేహం లేదు. అనారోగ్య కారణాల వల్ల మోదీ 2.0 మంత్రివర్గంలో ఆయన లేకపోయినా.. మోదీ తొలి మంత్రివర్గంలో ఆయనకున్న ప్రాధాన్యం ఇంకెవరికీ లేదనడంలో మరో మాటలేదు. కేవలం మంత్రిగానే కాకుండా.. వ్యూహకర్తగా, లాయర్‌గా, ప్రతిపక్ష నేతగా ఆయన సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించారు. 

వ్యూహాల్లో దిట్ట..
భారతీయ జనతా పార్టీలో ఎన్నికల వ్యూహాలు రచించడంలో జైట్లీ దిట్ట. భాజపా అధ్యక్షుడు అమిత్‌షా కన్నా ముందునుంచే  పార్టీకి వ్యూహాలు రూపొందించేవారు. లోక్‌సభ ఎన్నికలైనా, రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికలైనా జైట్లీ పాత్ర ఉండాల్సిందే. భాజపా ప్రధాన కార్యదర్శిగా పార్టీ విజయంలో కీలకపాత్ర పోషించిన ఆయన.. పలు రాష్ట్రాలకు ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. ఆయనలాగా  రాష్ట్రాల బాధ్యతలు బహుశా మరే భాజపా నేతా చూసుండకపోవచ్చు. ఆయన 2002లో గుజరాత్‌ రాష్ట్ర ఎన్నికల సందర్భంగా భాజపా ప్రచారబాధ్యతలను చూశారు. మధ్యప్రదేశ్‌, బిహార్‌, కర్ణాటక, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, గోవా, మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్‌, దిల్లీ, అసోం, పశ్చిమబెంగాల్‌ వంటి కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల బాధ్యతను పార్టీ తరఫున తనపై వేసుకున్నారు. తనదైన వ్యూహాలతో చాలాచోట్ల పార్టీకి విజయం అందించేందుకు కృషిచేశారు. 

మోదీ తొలి మంత్రివర్గంలో కీలక బాధ్యతలు
కేంద్ర ప్రభుత్వంలో పలు కమిటీలు ఉంటాయి. అందులో కేబినెట్‌ కమిటీ ఆన్‌ సెక్యూరిటీ (సీసీఎస్‌) ఒకటి. ప్రధాని అధ్యక్షత వహించే ఈ కమిటీలో రక్షణ, ఆర్థిక, హోం, విదేశీ వ్యవహారాల శాఖా మంత్రులు మాత్రమే సభ్యులుగా ఉంటారు. మొత్తం నాలుగు శాఖల్లో రెండు శాఖలను చూసేది జైట్లీనే. దీనినిబట్టి మోదీ కేబినెట్‌లో జైట్లీకున్న ప్రాధాన్యం ఏమిటో అర్థమవుతుంది. 2014 మే 26న మోదీ మంత్రివర్గ ప్రమాణస్వీకారం అనంతరం రెండు కీలక శాఖలైన ఆర్థిక, రక్షణను అరుణ్‌జైట్లీకి అప్పగించారు. తర్వాత కొన్నాళ్లకు రక్షణశాఖను మనోహర్‌ పారికర్‌కు అప్పగించినా.. ఆయన గోవా సీఎంగా వెళ్లిన తర్వాత మళ్లీ నిర్మలా సీతారామన్‌ ఆ బాధ్యతలు చేపట్టేవరకు రక్షణ మంత్రిగా జైట్లీ వ్యవహరించారు.

పాత సంప్రదాయాలకు చెల్లుచీటి
అరుణ్‌జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే మోదీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. ముఖ్యంగా జీఎస్టీని పట్టాలెక్కించడంలో ఆయన పాత్ర కీలకం. పెద్ద నోట్ల రద్దు వెనుకా ఆయన పాత్ర ఉంది. అంతేకాదు ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే కొన్నింట సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పటివరకు రైల్వే బడ్జెట్‌ను వేరుగా ప్రవేశపెట్టే సంప్రదాయానికి తెరదించారు. బడ్జెట్‌ తేదీని కూడా ముందుకు జరిపి ఫిబ్రవరి 1కి మార్చారు.

మోదీని తెరపైకి తీసుకురావడంలోనూ..
మోదీని ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టడంలోనూ జైట్లీది కీలక పాత్రే. ప్రధాని పదవికి మోదీ అభ్యర్థిత్వాన్ని అగ్రనేతలైన ఆడ్వాణీ, మురళీమనోహర్‌ జోషి, సుష్మాస్వరాజ్‌ వ్యతిరేకించారు. కానీ జైట్లీ మాత్రం ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. అప్పటికే పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న రాజ్‌నాథ్‌ సింగ్‌తో కలిసి ఆయన పేరునే ఖరారు చేయడంలో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మోదీని ముందు నిలిపిందీ జైట్లీనే.

ప్రతిపక్ష నేతగా.. లాయర్‌గా..
యూపీఏ హయాంలో అరుణ్‌జైట్లీ రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. కీలక సమయాల్లో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వంపై పార్టీ వాణిని బలంగా వినిపించారు. లాయర్‌గానూ ఆయన విజయవంతమైన పాత్ర పోషించారు. మోదీ, షాకు సంబంధించి కేసుల్లోనూ ఆయన వారి వెనుక ఉన్నారు. చివరగా గతేడాది కిడ్నీ సంబంధిత సమస్యతో ఎయిమ్స్‌లో చికిత్స తీసుకున్నారు. అంత అనారోగ్యంలోనూ ఆయన ఇంటి నుంచి బాధ్యతలు నిర్వర్తించారు. తనకు అప్పగించిన బాధ్యతలు సమర్థంగా నిర్వహించారు.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.