Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119001476
            [news_title_telugu_html] => 

మున్నాభాయ్ మళ్లీ రాజకీయాల్లోకి?

[news_title_telugu] => మున్నాభాయ్ మళ్లీ రాజకీయాల్లోకి? [news_title_english] => Actor Sanjay Dutt set to join Rashtriya Samaj Paksha MH Minister [news_short_description] => ప్రముఖ బాలీవుడ్‌ నటుడు మున్నాభాయ్‌ ఫేం సంజయ్‌ దత్‌ మళ్లీ రాజకీయాల్లోకి రానున్నారని మహారాష్ట్ర మంత్రి మహాదేవ్‌ జంకర్‌ తెలిపారు. సెప్టెంబర్‌ 25న రాష్ట్రీయ సమాజ్‌ పక్ష్‌(ఆర్‌ఎస్పీ)లో చేరనున్నారని ఆదివారం................. [news_tags_keywords] => Sanjay Dutt,Samajwadi Party,Rashtriya Samaj Paksh,Maharashtra [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-26 09:26:26 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మున్నాభాయ్ మళ్లీ రాజకీయాల్లోకి? - Actor Sanjay Dutt set to join Rashtriya Samaj Paksha MH Minister - EENADU
close

తాజా వార్తలు

మున్నాభాయ్ మళ్లీ రాజకీయాల్లోకి?

ముంబయి: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు మున్నాభాయ్‌ ఫేం సంజయ్‌ దత్‌ మళ్లీ రాజకీయాల్లోకి రానున్నారని మహారాష్ట్ర మంత్రి మహాదేవ్‌ జంకర్‌ తెలిపారు. సెప్టెంబర్‌ 25న రాష్ట్రీయ సమాజ్‌ పక్ష్‌(ఆర్‌ఎస్పీ)లో చేరనున్నారని ఆదివారం ప్రకటించారు. పార్టీని బలపరిచే క్రమంలో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు, అందులో భాగంగానే సంజయ్‌ని సంప్రదించినట్లు తెలిపారు. అయితే దీనిని సంజయ్‌ దత్‌ ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. 

గతంలో సంజయ్‌ దత్‌ సమాజ్‌ వాదీ పార్టీలో పని చేసిన విషయం తెలిసిందే. 2009 సార్వత్రిక ఎన్నికల్లో లఖ్‌నవూ నుంచి పోటీ చేయడానికి సన్నద్ధమవగా.. ఆయనపై ఉన్న కేసులు అడ్డంకిగా మారడంతో ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. అనంతరం ఆయనకు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. తదనంతర కాలంలో పార్టీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. తాజాగా జంకర్‌ ప్రకటనతో మరోసారి మున్నాభాయ్‌ రాజకీయ రీఎంట్రీపై ఊహాగానాలు ఊపందుకున్నాయి.

2019 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ ఆయన పోటీ చేస్తారని వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ, ఆయన వాటిని కొట్టిపారేశారు. సంజయ్‌ దత్‌ తండ్రి సునీల్‌ దత్‌ ముంబయి వాయువ్య లోక్‌సభ నియోజవకర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. యూపీఏ-1 హయాంలో 2004-మే 2005 మధ్య కేంద్ర యువజన, క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు కూడా నిర్వర్తించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.