close

తాజా వార్తలు

కేటీఆర్‌పై ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్‌: తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను మళ్లీ ప్రభుత్వంలో చూసేందుకు ఎదురు చూస్తున్నానంటూ ట్వీట్‌ చేశారు. గతేడాది ఒప్పో.. ఇటీవల అమెజాన్.. ఇవాళ వన్‌ప్లస్‌తో హైదరాబాద్ అంతర్జాతీయ శక్తిగా ఎదుగుతోందన్న ఓ జర్నలిస్టు ట్వీట్ పై అసదుద్దీన్ స్పందించారు. ఆ ఘనత మాజీ మంత్రి కేటీఆర్‌దేనని అసద్‌ పేర్కొంటూ.. ఆయనను మళ్లీ సర్కారులో చూసేందుకు వేచిచూస్తున్నానని వ్యాఖ్యానించారు. ఆ ట్వీట్‌కు కేటీఆర్‌ స్పందిస్తూ అసద్‌కు కృతజ్ఞతలు తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.