
తాజా వార్తలు
ఈడీ సమన్లపై కాంగ్రెస్ నేత శివకుమార్
బెంగళూరు: కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు. శుక్రవారం దిల్లీలోని ఈడీ అధికారుల ఎదుట హాజరు కావాలని స్పష్టం చేశారు. తాజా సమన్లపై శివకుమార్ స్పందిస్తూ.. తానేమీ తప్పు చేయలేదని అన్నారు. కార్యకర్తలు ఆందోళనకు గురికావద్దొని తెలిపారు.
‘ఆందోళన చెందకండి. అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను ఏ తప్పూ చేయలేదు. అత్యాచారం, డబ్బులు తీసుకోవడం లాంటి నేరాలకు పాల్పడలేదు. నాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆరోపణలు లేవు. నిన్న రాత్రి ఈడీ సమన్లు అందాయి. ఈ రోజు మధ్యాహ్నం అధికారుల ఎదుట హాజరుకావాలి. న్యాయవ్యవస్థపై నాకు నమ్మకం ఉంది. చట్టాన్ని గౌరవించి ఈడీ అధికారులకు సహకరిస్తాను’ అని శివకుమార్ అన్నారు.
దిల్లీలోని శివకుమార్ నివాసంలో రూ.8.59 కోట్ల నగదును ఏడాదిన్నర కిందట ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పన్ను ఎగవేత, హవాలా బదిలీల ఆరోపణల కింద గతేడాది సెప్టెంబరులో ఆయనపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇటీవల దర్యాప్తునకు రావాలంటూ ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే ఈ సమన్లను సవాల్ చేస్తూ శివకుమార్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా.. ఆయన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో నిన్న రాత్రి మరోసారి ఈడీ సమన్లు ఇచ్చింది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
- భాజపాకు తెరాస షాక్!
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
- శరణార్థులకు పౌరసత్వం
- లూప్ ఎంతకాలం ఉంచుకోవచ్చు?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
