
తాజా వార్తలు
జవహర్నగర్, న్యూస్టుడే: గుర్తుతెలియని దుండగులు వీధుల్లో తిరుగుతున్న ఓ మూగజీవి గొంతుకోసి రోడ్డుపై వదిలేసిన సంఘటన జవహర్నగర్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ భిక్షపతిరావు, స్థానికుల కథనం ప్రకారం.. జవహర్నగర్ గిరిప్రసాద్నగర్లో ఓ వీధి కుక్క మెడను కత్తితో దారుణంగా కోశారు. తీవ్రమైన గాయంతో రక్తపు మడుగులో ఉన్న శునకాన్ని స్థానికులు గుర్తించి పశు వైద్యులు, పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి వైద్యం అందించారు. స్థానికంగా నివసించే ఓ యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ స్థానికులు అతడి ప్రవర్తన తీరుపై పోలీసులకు వివరించారు. గతంలోనూ సదరు యువకుడు ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని, చెడు వ్యసనాలకు బానిసగా మారి వింతగా ప్రవర్తిస్తున్నాడని వారు ఆరోపించారు. ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- గొల్లపూడి తీరని కోరిక..!
- ‘నా జీవితంలో అది భయంకరమైన జ్ఞాపకం’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
